అయ్యో పాపం : గుర్రం ఒక్క తన్ను తంతే.. ఎగిరి పడి చనిపోయాడు 

అయ్యో పాపం : గుర్రం ఒక్క తన్ను తంతే.. ఎగిరి పడి చనిపోయాడు 

పెళ్లిళ్లంటే వీడియోలు, ఫొటోలు డ్యాన్స్ లు  గుర్రాలపై ఊరేగింపులు  ఉంటాయి.   డ్యాన్స్ లు, కేరింతలు, భాజా భజంత్రీలు ఇలా ఒకటేమిటి.. అన్ని విషయాల్లో  యూత్ ఎంజాయి చేస్తుంటారు.  ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు  చాలా ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి.  ఇప్పుడు ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా గుర్రం తన్నగా ఎగిరిపడి చనిపోయాడు. ఈ  వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.  ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఓ పెళ్లి వేడుక ఊరేగింపులో గుర్రాలున్నాయి.  ఓ వ్యక్తి గుర్రాల మధ్య విచిత్రంగా డ్యాన్స్ చేస్తున్నాడు.  ఆ డ్యాన్స్ ను ఓ గుర్రం తట్టుకోలేకపోయింది. ఇక అంతే కాలుతో ఒక్క తన్ను తన్నింది. 

మ్యారేజ్ సెలబ్రేషన్స్ లలో డ్యాన్స్ లు సాధారణమయ్యాయి.  స్నేక్ డ్యాన్స్, ఫన్నీ కాక్ డ్యాన్స్ ఇలాంటి జనాలు చేస్తుంటారు. ఇక హీరో, హీరోయిన్లను అనుసరిస్తూ పెళ్లిళ్ల ఊరేగింపులో డ్యాన్స్ చేస్తుంటారు.   వైరల్ అయ్యే వీడియోలో  వరుడి ఇంటినుండి వివాహ వేదికకు ఊరేగింపుగా వస్తున్నాడు.  అందరూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.  ఓ వ్యక్తి  చాలా టెన్షన్‌తో వచ్చి గుర్రాల మధ్య తన కళాత్మకతను చూపించడం ప్రారంభించాడు.  ఇక అంతే ఆ డ్యాన్స్ ను చూసి తట్టుకోలేక ఓ గుర్రం ఒక్క తన్ను తన్నగా ఎగిరిపడి చనిపోయాడు.   ఈ సంఘటన మొత్తం చూస్తే మాత్రం  ఎంత కోపంలో ఉన్నా సరే నవ్వి తీరాల్సిందే.  

 వీడియో వైరల్

@iama11__ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయబడింది. మే 22న అప్‌లోడ్ చేసిన క్లిప్‌ను ఇప్పటి వరకు లక్ష మంది  పైగా లైక్ చేయగా, ప్రజలు దానిపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఒకరు  దూలతో తన్నులు తిన్నారని రాయగా.. మరొకరు  కిక్ అద్భుతంగా ఉందని రాశారు.