ఆసీస్​ జోరు

ఆసీస్​ జోరు
  • ఐర్లాండ్​పై 42 రన్స్​తో గెలుపు
  • టీ20 వరల్డ్​కప్​లో రెండో విక్టరీ

బ్రిస్బేన్: ఓటమితో టీ20 ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆరంభించిన డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆతిథ్య ఆస్ట్రేలియా ఇప్పుడు గెలుపు జోరు కొనసాగిస్తోంది. సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌12లో   రెండో విజయంతో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫించ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చి దంచికొట్టడంతో పాటు బౌలర్లూ  సత్తాచాటడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది. ఈ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరులో టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆసీస్​ 20ఓవర్లలో 179/5 స్కోరు చేసింది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3), గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (13) ఫెయిలైనా.. మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (28), స్టోయినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (35) సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫించ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి స్కోరు అందించాడు. ఐరిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో మెకార్తీ (3/29), జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/21) రాణించారు. అనంతరం భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18.1 ఓవర్లలో 137 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటై ఓడిపోయింది. లోర్కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (48 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 71 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా.. మిగతా బ్యాటర్ల నుంచి అతనికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరువైంది. ఆసీస్​బౌలర్లలో కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/28), మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/14), స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/43), జంపా (2/19) తలో రెండు  వికెట్లు తీశారు. ఫించ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు దక్కింది.