సుశాంత్ సూసైడ్ పై సుప్రీంలో దుమారం

సుశాంత్ సూసైడ్ పై సుప్రీంలో దుమారం

కేసులో రియా పిటిషన్ పై ఆల్ పార్టీస్ రిప్లై

నా కొడుకుతో మాట్లా డనివ్వలే: సుశాంత్ తండ్రి రిటెన్ సబ్ మిషన్

న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ సూసైడ్ కేసులో సుప్రీంకోర్టు లో దుమారం రేగుతోంది. బీహార్ ప్రభుత్వం ముంబై పోలీసులపై ఆరోపణలు చేయగా, మహారాష్ట్ర సర్కార్ వాటి ని కొట్టిపారేసింది. మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్.. రియా చక్రవర్తిపై మరిన్ని ఆరోపణలు చేశారు. బీహార్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ చట్ట విరుద్ధమని రియా పేర్కొంది. తనపై బీహార్ పోలీసులు ఫైల్ చేసిన కేసును ముంబైకి ట్రాన్స్‌‌ఫర్ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంలో పిటిషన్ ఫైల్ చేసింది. దీనిపై విచారించిన సుప్రీం.. ఈ కేసులో ఆల్ పార్టీస్‌ రిటెన్ సబ్‌మిషన్ ఫైల్ చేయాలని ఆదేశించింది. అన్ని పార్టీలు గురువారం రిటెన్ సబ్ మిషన్ ఫైల్ చేశాయి. రియా తన కొడుకుతో మాట్లాడనివ్వలేదని, తాను మాట్లాడి ఉంటే సుశాంత్‌ను సేవ్ చేసేవాడినని సుశాంత్ తండ్రి కేకే సింగ్ రిటెన్ సబ్‌మిషన్ లో తెలిపారు. ‘‘సుశాంత్ మరణానికి ముందు నేను చాలాసార్లు ఫోన్ చేశాను . కానీ రియా నా కొడుకు నాతో మాట్లాడకుండా అడ్డుకుంది” అని సింగ్ అన్నారు.

ముంబై పోలీసులపై పొలిటికల్ ప్రెజర్: బీహార్

సుశాంత్ కేసులో ముంబై పోలీసులపై పొలిటికల్ ప్రెజర్ ఉందని బీహార్ ప్రభుత్వం ఆరోపించింది. అందుకే ముంబై పోలీసులు సుశాంత్ సూసైడ్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని, ఇన్వెస్టిగేషన్ కు వెళ్లిన బీహార్ పోలీసులకూ సహకరించలేదని రిటెన్ సబ్మిషన్ లో పేర్కొంది. సుశాంత్ సూసైడ్ పై కేసు ఫైల్ చేసేందుకు, ట్రాన్స్ ఫర్ చేసేందుకు గానీ బీహార్ ప్రభుత్వానికి అధికారం లేదని రియా అన్నారు. పాట్నాలో దురుద్దేశంతో కేసు ఫైల్ చేశారని, అది ఇల్లీగల్ అని మహారాష్ట్ర  ప్రభుత్వం ఆరోపించింది. సుశాంత్ కేసును సీబీఐకి ట్రాన్స్ ఫర్ చేయడం ఇల్లీగల్ అని శివసేన లీడర్‌‌ సంజయ్ రౌత్ అన్నారు.

అసలు క్వశ్చనే లేదు: సీబీఐ

సుశాంత్ సూసైడ్ పై మహారాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని, కేసు పెండింగ్‌ లో లేదని సీబీఐ తెలిపింది. అలాంటప్పుడు కేసును ట్రాన్స్‌ఫర్ చేయాలనే ప్రశ్నే ఉండదని పేర్కొంది. ఇప్పటికే సుశాంత్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, కేసులో ఈడీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తోందని సుప్రీంకు ఇచ్చిన రిటెన్ సబ్మిషన్ లో వెల్లడించింది.