నిరుద్యోగులు ఏడున్నరు రఘునందన్ : మంత్రి కేటీఆర్

నిరుద్యోగులు ఏడున్నరు రఘునందన్ : మంత్రి కేటీఆర్

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మధ్య  హాట్ హాట్ డిస్కషన్ జరిగింది. నిరుద్యోగ భృతిపై మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే రఘునందర్ రావు నిలదీశారు. మూడేళ్లు దాటినా..తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చలేదన్నారు. రఘునందన్ రావు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రఘునందన్ రావు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పని మంత్రి కేటీఆర్..ప్రధాని మోడీ ఉద్యోగ హామీని లేవనెత్తి రఘునందన్ రావును ఎద్దేవా చేశారు. 


రఘునందన్ రావు పంచుల ప్రశ్నలు..

2018 ఎన్నికలప్పుడు మంత్రి కేటీఆర్ అన్ని మీడియా ఛానళ్ల మందుకు వచ్చి  ఓ మంచి మాట చెప్పారు. డిసెంబర్ 11 ఫలితాలొస్తాయి. 14 తర్వాత రాష్ట్రంలోని అందరికి ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు గానీ..ప్రతీ ఒక్కరికి జనవరి 2019 నుంచి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని కేటీఆర్ స్పష్టం చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ భృతి పై చెప్పారు. ఇప్పటికి మూడేళ్లు దాటిపోయింది. ఆ స్కీము అమలు చేయలేదు..స్కీము అమలు చేసి గవర్నర్ ప్రసంగంలో పెట్టి ఉంటే బాగుండేది...అని రఘునందన్ రావు ప్రశ్నలు వేశారు. 


కేటీఆర్ సెటైరికల్ సమాధానాలు..

పరిశ్రమలు, ఉపాధి కల్పన గురించి  చాలా చెప్పొచ్చు. కానీ  ఒకటి చెప్తాను. కేంద్రం సహకరించకపోయినా..ఐటీఐఆర్ ను రద్దు చేసినా..తెలంగాణ ప్రభుత్వం ఉజ్వలంగా ముందుకు సాగుతుంది.  మొన్ననే నాస్కామ్ డేటా వచ్చింది. అందులో స్పష్టంగా చెప్పారు. గతేడాది భారతదేశంలో ఐటీ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు కొత్తవి సృష్టించబడితే..అందులో లక్షా 50వేల ఉద్యోగాలు హైదరాబాద్ లోనే వచ్చాయి. లక్షా 46 వేల ఉద్యోగాలతో రెండో స్థానంలో బెంగుళూరు ఉంది.   ఇది కాదా కేసీఆర్ నాయకత్వం సమర్థత. ఇది కాదా పురోగమన ప్రగతిశీల ప్రభుత్వం సమర్థతకు నిదర్శనం...అని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 

కేటీఆర్ గుండు సున్నా సెటైర్లు..

విభజన చట్టంలో కేంద్రం మాటిచ్చింది. పారిశ్రామిక కారిడార్ లు ఇస్తాం. ప్రత్యే క రాయితీలుస్తాం. ప్రోత్సహాకాలు ఇస్తాం అని.  కానీ ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా. హైదరాబాద్ లో ఫార్మాసిటీ కడుతున్నాం..సాయం చేయమని అడిగితే కేంద్రం ఇచ్చింది గుండు సున్నా.  కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు కడుతున్నాం సహకరించండి అంటే దానికి గుండు సున్నా.  ఉత్తుత్తి మాటలు తప్ప..ఉత్పత్తి మీద కేంద్రానికి దృష్టి లేదు.  మేకిన్ ఇండియా అని తయారు చేశారు. మేకిన్ ఇండియాలో 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం అని ప్రధాని మోడీ అన్నరు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నరు..ఇప్పటికి 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.  రఘునందన్ నిరుద్యోగ భృతి అంటుండు. మోడీ గారు అన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఎందుకు...?  2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు... అమృత్ కాలం వచ్చింది. ఇంక నిరుద్యోగ భృతి ఎందుకు..?  అచ్చెదిన్ వచ్చాయి.. వికాస్ వచ్చింది. అమృత్ కాలం వచ్చింది.  ఇక నిరుద్యోగ భృతి ఎందుకు..?. మీరె చెప్పారు కదా..ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు.. ఎంత దుర్మార్గం అంటే..2 కోట్ల ఉద్యోగాలు ఏవీ అని  ఓ టీవీ డిస్కషన్ లో  మోడీని అడిగితే.. పకోడి బండి , మిర్చీ బండి చూపించి..అది ఉద్యోగమే కదా అన్నడు..అంటే పకోడీలు, మిర్చీలు వేయడం కూడా మోడీ గొప్పతనమేనా..? అని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.