షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

  షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

మహబూబాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ఇల్లు దగ్ధమైంది. జనవరి 2వవ తేదీ సోమవారం రాత్రి సమయంలో  కొత్తగూడ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో బంగారు సమ్మయ్య ఇంట్లో అర్థరాత్రి ప్రమాదవశాత్తు కరెంటు షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. 

ఈ ప్రమాదంలో సుమారు రూ.4లక్షల వరకు ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వివరాలు సేకరించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.