
పద్మారావునగర్, వెలుగు: బౌద్ధనగర్ డివిజన్ లోని ఎల్ఎన్నగర్ లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న బిల్కిస్‌బానో ఇంట్లో షార్ట్ సర్య్కూట్కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.
ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కార్పొరేటర్కంది శైలజ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.