రక్షణ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపిన యూఎస్ హౌస్

రక్షణ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపిన యూఎస్ హౌస్

ఇటీవల అబార్షన్లపై రాజ్యాంగపరమైన హక్కును తొలగించిన అమెరికా అత్యున్నత న్యాయస్థానం... తాజాగా మరో కీలక నిర్ణయాన్ని పచ్చజెండా ఊపింది. స్వలింగ సంపర్కుల వివాహానికి రక్షణ కల్పిస్తూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ బిల్లును ఆమోదించింది. రెస్పెక్ట్ ఫర్ మ్యారెజెస్ యాక్ట్ పేరుతో  జో బైడెన్ ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లుకు.. 47 మంది ప్రతిపక్ష రిపబ్లికన్ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. మరో ఏడుమంది రిపబ్లికన్లు తటస్థంగా వ్యవహరించారు. ఇక సెనెట్ దీన్ని ఆమోదించాల్సి ఉంది. సేమ్ సెక్స్, ఇంటర్‌రేసియల్ వివాహాలకు రక్షణ కల్పించాలనే డిమాండ్ అమెరికాలో చాలాకాలం నుంచే ఉంది. దీనిపై కొన్ని సందర్భాల్లో ఎల్జీబీటీక్యూ అసోసియేషన్లు ర్యాలీలను కూడా నిర్వహించాయి. అబార్షన్లపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఎల్జీబీటీక్యూల్లో అభద్రతభావం ఏర్పడిందని, దీన్ని తొలగించేలా ఈ రెస్పెక్ట్ ఫర్ మ్యారెజెస్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చామని డేవిడ్ సిసిల్లీన్ చెప్పారు. ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.