
బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కామెడీ మూవీ సీరీస్ గా తెరకెక్కిన హౌస్ ఫుల్ సినిమాలు ఫ్యాన్స్ ను ఎంతలా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు 4 సినిమాలు రాగా.. ఫిఫ్త్ పార్ట్ జూన్ 6న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందో ఓ సారి చర్చిద్దాం.
సాజిద్ నిదియావాలా నిర్మాణంలో.. తరుణ్ మన్సుఖానీ డైరెక్ట్ చేసిన హౌస్ ఫుల్-5 మరోసారి ఈ సీక్వెన్స్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. కన్ఫూజన్ క్యారెక్టర్స్, సస్పెన్స్, మిస్టరీ, కామెడీ ఇలా.. ఆడియెన్స్ ను థ్రిల్ చేసే ఈ సీక్వెన్స్ లో.. అంతకు మించిన ప్యాక్ తో సినిమా విడుదలకు సిద్ధమైంది.
స్టోరీ విషయానికి వస్తే.. ఒక వందేళ్లు నిండిన బిలియనీర్.. తన 69 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.6 లక్షల కోట్ల సామ్రాజ్యానికి.. జాలీ అనే వారసుడిని ప్రకటించేందుకు రెడీ అవుతాడు. అయితే అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, రితేష్ దేష్ ముఖ్.. నేనే జాల్లీ అంటే నేనంటూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ఆ అల్లరిలో అనుకోకుండా ఊహించని డ్రింక్ ఒకటి తాగి మెమరీ కోల్పోతారు. ఆ పార్టీలో రాత్రి ఆ బిలియనీర్ చనిపోవడం స్టోరీకి మరింత కన్ఫూజన్ మొదలైతుంది. అయితే ఆ ముగ్గురిలో నిజమైన జాల్లీ ఎవరు.. బిలియనీర్ ను ఎవరు చంపారు.. ఆయన బాడీ ఎక్కడికెళ్లింది..? అనే ప్రశ్నలతో స్టోరీ సస్పెన్స్ లో పడిపోతుంది.
స్టోరీ సస్పెన్స్ లో పడిన తర్వాత.. కథలోకి సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ రూపంలో ఇద్దరు పోలీసులు ఎంట్రీ ఇస్తారు. నానా పటేకర్ కూడా స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చి కథను మలుపులు తిప్పుతుంటారు. స్టోరీ క్లియర్ కట్ గా అర్థమయ్యేలా.. ట్రైలర్ ను రూపొందించారు . ఈ సస్పెన్స్, అల్లరీ, కామెడీ, వెర్రితనంలో.. గ్లామర్ టచ్ కూడా మిస్ అవ్వకుండా చూసుకున్నారు మేకర్స్. జాక్విలిన్ ఫెర్నాండేజ్, సోనం బజ్వా, నర్గీస్ ఫక్రీ ట్రైలర్ లో ఆకట్టుకున్నారు.
కామెడీ, థ్రిల్లింగ్, సస్పెన్స్, మిస్టరీతో కూడిన హౌస్ ఫుల్ -5 సినిమాను జూన్ 6 న థియేటర్ లలోకి వదులుతున్నారు. హౌస్ ఫుల్ మూవీ సీక్వెన్స్ చూసినవాళ్లు.. ఫిఫ్త్ మూవీ కోసం ఎదురు చూస్తున్న వాళ్లు.. గెట్ రెడీ టు ఎంజాయ్. ట్రైలర్ ను కింద చూడవచ్చు.