హైదరాబాద్‌‌లో ఇండ్లు మస్తు కాస్ట్‌‌లీ

హైదరాబాద్‌‌లో ఇండ్లు మస్తు కాస్ట్‌‌లీ
  • జూలై-సెప్టెంబర్‌‌లో 4 శాతం ధరలు పెరిగాయి
  • నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడి
  • హైదరాబాద్, బెంగళూరులోనే ధరల పెరుగుదల
  • మిగిలిన సిటీల్లో తగ్గిన ధరలు

బిజినెస్డెస్క్‌, వెలుగుకరోనా దెబ్బకు చాలా ప్రాంతాల్లో ఇండ్ల ధరలు తగ్గుతూ ఉంటే.. హైదరాబాద్, బెంగళూరులో మాత్రం ఇండ్ల ధరలు మరింత పెరిగాయి. 2020 జులై–సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో బెంగళూరులో ఇండ్ల ధరలు 3 శాతం, హైదరాబాద్‌‌లో  4 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్‌‌లో వెల్లడైంది. హైదరాబాద్‌‌లో హౌసింగ్ సేల్స్ కూడా ఈ క్వార్టర్‌‌‌‌లో 4,760 యూనిట్ల నుంచి 1,609 యూనిట్లకు తగ్గాయి. ఆఫీసు స్పేస్ లీజింగ్ 3.7 మిలియన్ చదరపు అడుగుల నుంచి0.5 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. ఒకవైపు సేల్స్ లేకపోయినప్పటికీ.. హైదరాబాద్‌‌లో ధరలు మాత్రం తగ్గలేదు.  ఇదే కాలంలో ఢిల్లీ, చెన్నై, పుణే, కోల్‌‌కతా, అహ్మదాబాద్‌‌ సిటీల్లో  కరోనాతో డిమాండ్ తగ్గడంతో ధరలు సగటున 2 శాతం నుంచి 7 శాతం వరకు తగ్గాయి. చెన్నైలో ఎక్కువగా 7 శాతం వరకు ధరలు తగ్గాయి. ఢిల్లీ–ఎన్‌‌సీఆర్ పుణేలో 5 శాతం, కోల్‌‌కతా, అహ్మదాబాద్‌‌లో 3 శాతం, ముంబై 2 శాతం వరకు రేట్లు పడిపోయాయి. 2020 క్యూ3లో  ఎనిమిదింటిలో ఆరు మార్కెట్లలో హౌసింగ్ ధరలు తగ్గినట్టు నైట్ ఫ్రాంక్ కన్సల్టెంట్ రిపోర్ట్ చేసింది. గతేడాదితో పోలిస్తే మాత్రం ఈ జులై–-సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో హౌసింగ్ సేల్స్ తగ్గాయి. టాప్ 8 సిటీల్లో హౌసింగ్ సేల్స్ 43 శాతం, ఆఫీసు స్పేస్ లీజింగ్ 70 శాతం తగ్గినట్టు నైట్ ఫ్రాంక్ రిపోర్ట్‌‌లో వెల్లడైంది. కరోనా ఎఫెక్ట్‌‌తో హౌసింగ్ సేల్స్ తగ్గినట్టు రిపోర్ట్ తెలిపింది. ఏప్రిల్–-జూన్ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే మాత్రం హౌసింగ్ సేల్స్ మూడింతలు పెరిగాయి. ఆఫీసు స్పేస్ లీజింగ్ 81 శాతం ఎగిసింది. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం.. జులై––సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో హౌసింగ్ సేల్స్ 33,403 యూనిట్లుగా ఉన్నాయి. గత క్వార్టర్‌‌‌‌లో ఇవి 9,632 యూనిట్లుగానే నమోదయ్యాయి.  జులై–-సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో సేల్స్ డేటా ప్రోత్సాహకరంగా ఉందని, కానీ ఇంకా పూర్తిగా బయటపడలేదని శిశిర్ అన్నారు. వచ్చే ఏడాది డిమాండ్ కచ్చితంగా 2019 స్థాయిలకు చేరుకుంటుందని  విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ఈ ఎనిమిది సిటీల్లో గ్రాస్ ఆఫీసు స్పేస్ లీజింగ్ ఈ క్వార్టర్‌‌‌‌లో 15.7 మిలియన్ చదరపు అడుగుల నుంచి 4.7 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. కార్పొరేట్ కంపెనీలు  తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయడంతో ఆఫీసు లీజింగ్ తగ్గింది.

కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్‌‌‌‌లో కన్సాలిడేషన్…

ఇండియాలో కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్ కన్సాలిడేట్ అవుతోంది. పెద్ద పెద్ద ప్లేయర్లే మార్కెట్‌‌లో నిలదొక్కుకునేలా ఈ సెక్టార్ పరిస్థితి మారింది. డీమానిటైజేషన్, రెరా, జీఎస్టీ అమలు తర్వాత చాలా మంది డెవలపర్లు సిటీల్లో తగ్గిపోయారు. కన్జూమర్లు కూడా బ్రాండెడ్ ప్లేయర్ల వైపుకి చూస్తుండటంతో చిన్న డెవలపర్లు కనుమరుగవుతున్నారు. టాప్ 17 నగరాల్లో ఇండస్ట్రీ అంచనాల ప్రకారం 2012‌‌లో 2,744 మంది డెవలపర్లుంటే.. వీరు ప్రస్తుతం 1,287కు తగ్గారు. డెవలపర్ల సంఖ్య మరింత తగ్గుతుందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. కరోనాతో కన్సాలిడేషన్ మరింత పెరుగుతుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చెప్పింది. నగదు కొరతతో ఇబ్బంది పడుతోన్న డెవలపర్లు ఫైనాన్షియల్‌‌గా స్ట్రాంగ్‌‌గా ఉన్న బిల్డర్లకు స్ట్రక్ అయిన ప్రాజెక్ట్‌‌లను టేకోవర్ చేస్తున్నారు. స్ట్రెస్డ్ డెవలపర్లు జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ల్యాండ్‌‌ను మోనిటైజ్ చేస్తున్నారు.  మేజర్ సిటీల్లో డెవలప్‌‌మెంట్ మేనేజ్‌‌మెంట్ కాంట్రాక్ట్‌‌లను పొడిగిస్తున్నారు. ‘కొత్త ప్రాజెక్ట్‌‌ల లాంఛ్‌‌లు, సేల్స్ కొద్ది మంది డెవలపర్ల మధ్యనే జరుగుతుంది. మెజార్టీ మార్కెట్ షేరు వాళ్ల చేతిలోనే ఉంటుంది. మరికొన్నేళ్లలో పది మంది డెవలపర్లే ఉంటారు’ అని అసెట్జ్ గ్రూప్ సీఐఓ సునీల్ పరీఖ్ చెప్పారు.

క్యూ3లో సేల్స్ బెటర్

2020 క్యూ3లో సేల్స్, కొత్త ప్రాజెక్ట్‌‌ల లాంఛ్‌‌లలో మెరుగుదల కనిపించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ చెప్పారు.  ఏప్రిల్–జూన్‌‌ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే సేల్స్ మెరుగుపడ్డాయని తెలిపారు. డెవలపర్లు కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఫైనాన్షియల్​ ఆఫర్లను, డిస్కౌంట్లను, ఈజీ పేమెంట్ ఆప్షన్లను తీసుకొచ్చినట్టు పేర్కొంది. హోమ్ లోన్ ఇంటరస్ట్ రేట్లను తక్కువ చేయడం కూడా రెసిడెన్షియల్ సేల్స్‌‌ పెరిగేందుకు సహకరించాయి. కస్టమర్లతో కాంటాక్ట్ అయ్యేందుకు బిల్డర్స్ డిజిటల్ టూల్స్‌‌ను వాడుతున్నారు. కరోనా లాక్‌‌డౌన్‌‌తో ఇళ్లకు పోయిన వర్కర్లు కూడా ఎంప్లాయిమెంట్ కోసం తిరిగి నగరాలకు వస్తున్నారు. రెసిడెన్షియల్ సెక్టార్  సాధారణ స్థితికి ఇంకా దూరంగా ఉన్నా.. ఈ క్వార్టర్‌‌‌‌లో కాస్త మెరుగుపడిందని రిపోర్ట్ తెలిపింది.

– శిశిర్ బైజాల్, సీఎండీ,

నైట్ ఫ్రాంక్ ఇండియా   

లిక్విడిటీ సంక్షోభం ఏర్పడటంతో.. డెవలపర్లు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు చాలా ఆప్షన్లను వెతికారు. వాటిల్లో బెస్ట్ ఆప్షన్లలో ఒకటిగా కన్సాలిడేషన్‌‌ పరిగణనలోకి తీసుకున్నారు.

– నిరంజన్ హీరా ​నందానీ ,  ప్రెసిడెంట్, అసోచామ్, ఎన్‌‌ఏఆర్‌‌‌‌ఈడీసీఓ