Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్? బుల్లితెర స్టార్లతో పాటు చిట్టి పికిల్స్ రమ్య ఎంట్రీ!

Bigg Boss Telugu 9 :  బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్? బుల్లితెర స్టార్లతో పాటు చిట్టి పికిల్స్ రమ్య ఎంట్రీ!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 9' ( Bigg Boss Season 9 ) తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికే దీనికి సంబందించిన ఏర్పాట్లు అన్నపూర్ణ స్టూడియాలో పూర్తి కావస్తున్నాయి.  ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే లక్షల్లో ధరఖాస్తు వచ్చాయి . అటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని ఫైనల్ చేసే పనిలో యాజమాన్యం ఉంది.   మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ ( Akkineni Nagarjuna) గా వ్వవహారించనున్న బిగ్ బాస్ సీజన్ 9 షో .. ఈసారి మరింత  డ్రామా, ఉత్కంఠం, ఎంటర్ టైన్మెంట్ తో ఉండబోతుందని ఇప్పటికే ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి.  ఈసారి హౌస్ లోకి వెళ్లేది ఎవరు అనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ పేర్లపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా?
అటు బిగ్ బాగ్ హౌస్ లోకి వెళ్లే వాళ్ల పేర్లు ఒక్కొక్కటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సీజన్ 9 కోసం ఇప్పటికే బుల్లితెరతో వెండితెర నటీనటులు, సింగర్స్, యాంకర్స్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్స్ ను కంటెస్టెంట్స్ గా ఎంపిక చేసినట్లు వారి పేర్లు వైరల్ అవుతున్నాయి.  వారిలో ప్రధానంగా సీరియల్ నటులు సాయి కిరణ్, నటి రీతూ చౌదరి,  జబర్దస్త్ షోలో మంచి కమెడియన్స్  గా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్, వర్ష తోపాటు  నటుడు పరమేశ్వర్ హివ్రాలే, తెలంగాణకు చెందిన జానపద నృత్య కారిణి నాగ దుర్గా గుత్తా, నేపథ్య గాయకుడు శ్రీతేజ కందర్ప పేర్లు వినిపిస్తున్నాయి. 

చిట్టి పికిల్స్ రమ్య రచ్చ చేస్తుందా?
అంతే కాదు సోషల్ మీడియాలో బోల్డ్ ఎక్స్ ప్రెషన్స్, నేచురల్ స్క్రీన్ ప్రెజెన్స్ కు పెట్టింది పేరుగా మారి.. చిట్టి పికిల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న  రమ్య మోక్ష  పేరు  కూడా వినిపిస్తోంది. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో యూత్ ఫాలోయింగ్ మాములుగా లేదు. ఒక్క రీల్ పెట్టిందంటే చాలు లైకుల వర్షం కురిపిస్తారు అభిమానులు. ఇటీవల తన పికిల్స్ వ్యాపార వివాదంతో కూడా బాగా పాపులార్టీని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిట్టి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే రచ్చ రచ్చే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.   అటు సామాన్యులకు కూడా ఈసారి చోటు ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 

►ALSO READ | Jr NTR : కిరీటికి జూ. ఎన్టీఆర్ ఆశీస్సులు.. 'జూనియర్' ప్రీ-రిలీజ్‌కు తారక్ రాక?

సరికొత్త ఉత్సాహాంగా.. 
ఈ సారి తొమ్మిదో సీజన్‌తో సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి రెడీగా ఉంది.   సీజన్ 3 నుంచి అక్కినేని నాగార్జున తనదైన చరిష్మా, తెలివితేటలు, అద్భుతమైన హోస్టింగ్‌తో షోను భారీ విజయంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  అదే సీజన్ 9 కూడా సరికొత్తగా ఉండబోతోంది. "ఈసారి చదరంగం కాదు, రణరంగమే" అంటూ నాగార్జున కొత్త సీజన్ ప్రోమోలో చెప్పిన డైలాగ్, ఈసారి పోటీ ఎంత హోరాహోరీగా ఉండబోతుందో తెలియజేస్తుంది.  సెప్టెంబర్ 7, 2025న స్టార్ మాలో ' బిగ్ బాస్ తెలుగు 9 '( Bigg Boss Telugu 9 ) గ్రాండ్ ప్రీమియర్‌కు రంగం సిద్ధమౌతోంది.