Jr NTR : కిరీటికి జూ. ఎన్టీఆర్ ఆశీస్సులు.. 'జూనియర్' ప్రీ-రిలీజ్‌కు తారక్ రాక?

Jr NTR : కిరీటికి జూ. ఎన్టీఆర్ ఆశీస్సులు.. 'జూనియర్' ప్రీ-రిలీజ్‌కు తారక్ రాక?

రాజకీయ నాయకుడు, వ్యాపార వేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి ( Kireeti Reddy ) హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 'జూనియర్' (Junior) .  రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో శ్రీలీల ( Sreeleela ) కథానాయికగా నటించింది.  చాలా కాలం తర్వాత తిరిగి జెనీలియా తెలుగు, కన్నడ తెరపై కనిపించనున్నారు. ప్రత్యేక పాత్రలో ఆమె నటించారు.  జూలై 18, 2025న విడుదలకు సిద్ధమవుతుంది.  దీంతో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు.  ఈ క్రమంలో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.  హైదరాబాద్‌లో జరగనున్న ఈ మూవీ ‌ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) హాజరుకానున్నారని తెలుస్తోంది.

'జూనియర్' మూవీ ప్రచారంలో భాగంగా ఇటీవల చిత్ర బృందం బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హాజరయ్యారు. కిరీటి, శ్రీలీలతో కలిసి స్టేజీపై 'వైరల్ వయ్యారి' పాటకు  స్టెప్స్ వేసి అందరిని ఉత్సాహపరిచారు. ఈ చిత్రంలో కిరీటి నటన, డ్యాన్స్ అద్భుతంగా ఉందన్నారు.  ఇది పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యువ నటీనటులకు తన సపోర్టు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న  ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన  వెలువడలేదు.  ఒక నూతన నటుడి తొలి సినిమా ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హాజరైతే.. ఆ మూవీకి భారీ స్థాయిలో ప్రచారం లభించినట్లే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  

 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.  ఇటీవల తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం 'వార్ 2' ( War2 ) షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రదాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.  మరో వైపు ఎన్టీఆర్ KGF , సలార్ దర్శకుడు ప్రశాంత్ నిల్ తో ఒక భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలవనుందని టాక్ . మరో వైపు  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒక చిత్రంలో నటించనున్నారని సమాచారం.

►ALSO READ | Vijay Deverakonda : 'డాన్ 3' ఆఫర్‌ను తిరస్కరించిన విజయ్ దేవరకొండ? అభిమానులకు షాక్!