
బాలీవుడ్‌లో అత్యంత యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'డాన్ ' ( Don ). ఇది ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అదేస్థాయిలో 'డాన్ 2 ' ( Don 2) కూడా రెట్టింపు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన 'డాన్ 3' ( Don 3 ) ని తెరకెక్కించేదుకు భారీగా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫర్హన్ అక్తర్ ( Farhan Akhtar ) ఈ యూనివర్స్ సిక్వెల్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో పాత డాన్ షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) స్థానంలో రణ్‌వీర్‌సింగ్ ( Ranveer Singh ) కీలక పాత్రలో నటిస్తున్నారు. కృతి సనన్ ( Kriti Sanon ) హీరోయిన్‌గా అలరించనుంది. ఇప్పటికే ఈ చిత్రంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీకి విషయంలో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.
విలన్ పాత్రకు నో చెప్పిన విజయ్ దేవరకొండ
అత్యంత ప్రతిష్టాత్మకమైన 'డాన్ 3' ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఈ సినిమాలోని ప్రధాన విలన్ పాత్ర కోసం టాలీవుడ్ నటుడు విజయ్ దేవర్ కొండను మూవీ మేకర్స్ సంప్రదించినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో ఈ పాత్ర కోసం విక్రాంత్ మాన్సే పేరు కూడా వినిపించింది. కానీ విజయ్ పేరు తెరపైకి రావడం ఈ వార్తలకు మరింత ఊపునిచ్చింది. ఫర్హన్ అక్తర్ మార్కు స్టైలైజ్డ్ యాక్షన్ మూవీలో రణ్‌వీర్‌సింగ్ , విజయ్ దేవరకొండ మధ్య ఒక ఎలక్ట్రిఫైయింగ్ షోడౌన్ ఉంటుందని అభిమానులు భారీగా అంచనాలు వేసుకుంటున్నారు. దీంతో ఈ కాంబినేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ నెలకొంది.
'లైగర్' మూవీ నిరాశలో వ్యూహాత్మకంగా అడుగులు..
గతంలో 'లైగర్ ' ( Liger ) మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. దీని తర్వాత బాలీవుడ్‌లో కనించలేదు. ఈ నేపథ్యంలో 'డాన్ 3' వంటి ప్రతిష్టాత్మక ఫ్రాంఛైజీ ద్వారా విజయ్ బాలీవుడ్ కమ్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు భావించారు. కానీ విజయ్ మాత్రం ఈ విలన్ పాత్ర కోసం వచ్చి ఆఫర్స్ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ప్రస్తుతం తన రాబోయే తెలుగు ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల వరుస అపజయాలు మూటగట్టుకోవడంతో విజయ్ తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి స్ర్కిప్ట్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ALSO READ : B Saroja Devi: స్వర్ణయుగం ముగిసింది.. లెజెండరీ నటి సరోజా దేవి మృతిపై ప్రముఖుల సంతాపం
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి స్పై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్ డమ్' ( Kingdom ) మూవీ విడుదలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం జూలై 31, 2025న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. 'లైగర్' మూవీ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూడాలి మరి.