Prabhas: హైదరాబాద్‌లో ప్రభాస్ సందడి.. వైరల్ అవుతున్న 'F1' మూవీ నైట్ పిక్స్!

Prabhas: హైదరాబాద్‌లో ప్రభాస్ సందడి..  వైరల్ అవుతున్న 'F1' మూవీ నైట్ పిక్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) , దర్శకుడు ప్రశాంత్ నిల్ ( Prashanth Neel )  హైదరాబాద్ లో  సందడి చేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సలార్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ బ్లాక్ బాస్టర్ కాంబో కలిసి ఓ సినిమా చూసేందుకు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.  హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ' F1' చిత్రాన్ని వీరు కలిసి వీక్షించారు. ఈ ఇద్దరు కలిసి సినిమా చూస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

 

ఈ ఫోటోలు హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో తీసినట్లు తెలుస్తోంది.  సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నిల్ థియేటర్ సిబ్బందితో కలిసి ఫోజులిచ్చారు .  బ్రాడ్‌ పిట్‌ నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం 'ఎఫ్ 1' (F1) జూన్ 27న విడుదలైంది. జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ, కేవలం మూడు వారాల్లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 67 కోట్లు రాబట్టింది.  ప్రభాస్, ప్రశాంత్ నిల్ కలిసి బయట కనిపించడంతో అభిమానులు తమ సెల్ ఫోన్ కెమెరాలతో ఫోటోలు తీశారు. ఈ పిక్చర్స్ ఇప్పుడు  ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.  ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ..  సలార్ 2 ( Salaar 2 ) ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   

ALSO READ : Narivetta Review: ఓటీటీలో దూసుకెళ్తోన్న రియల్ ఇన్సిడెంట్ థ్రిల్లర్.. ‘నరివేట్ట’ ఎందుకు చూడాలంటే?

 

డిసెంబర్ 2023లో ప్రభాస్, ప్రశాంత్ నిల్ కాంబోలో వచ్చిన మూవీ 'సలార్ పార్ట్ 1' (Salaar  Part 1 ). ఇది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 617 కోట్లకు పైగా వసూలు చేసింది.  ఇప్పుడు దీని సిక్వేల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.  'సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం' ( Salaar 2 ) అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ హీరో, దర్శకుడు ఇద్దరూ తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో కొంత కాలం తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.  హను రాఘవపూడితో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగాతో ' స్పిరిట్' ( Spirit )  లో నటిస్తున్నారు.  మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ ( Rajasaab ) మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , ఐవీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.   రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటించారు.  ఈ చిత్రంలో సంజయ్ దత్, రిద్ది కుమార్ కూడా నటించారు. తమన్ సంగీతం అందించారు.