అక్టోబర్ నెలలో తిరుమలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారా..? ఆన్లైన్లో దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే..

అక్టోబర్ నెలలో తిరుమలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారా..? ఆన్లైన్లో దర్శన టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే..

అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన కోటా విడుదల వివరాలు వెల్లడించింది టీటీడీ. అక్టోబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటాను జులై 19న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది టీటీడీ. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని.. 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్ప‌యాగం టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. వర్చువల్ సేవల కోటాను జులై 22న విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.

ALSO READ : ఆధ్యాత్మికం: జులై 16 నుంచి దక్షిణాయనం.. పితృ దేవతలను ఇలా స్వర్గానికి పంపండి..!

జులై 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు :

అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు తెలిపింది టీటీడీ. అదే రోజున శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఆన్ లైన్ కోటా కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. వృద్ధులు, దివ్యాంగులకు సంబందించిన దర్శన కోటా జులై 23న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. 

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల: 

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు తెలిపింది టీటీడీ. అలాగే తిరుమల, తిరుపతిలో గదులకు సంబంధించిన కోటా కూడా జులై 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైటులోనే టికెట్లు బుక్ చేసుకోవాలని.. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించింది టీటీడీ.