లాక్ డౌన్ అమలుపై కేంద్రానికి స్పష్టత లేదు: బెంగాల్ సీఎం

లాక్ డౌన్ అమలుపై కేంద్రానికి స్పష్టత లేదు: బెంగాల్ సీఎం

లౌక్ డౌన్ అమలుపై కేంద్రం విరుద్దమైన ప్రకటనలు చేస్తుందని అన్నారు పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సోమవారం సాయంత్రం బెంగాల్ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె… లాక్ డౌన్ కొనసాగించమని ఒక వైపు చెప్తూ.. దుఖాణాలను తెలరవాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఎలా ఇచ్చిందని అన్నారు. అయితే తాము మాత్రం లాక్ డౌన్ ను ఖచ్చితంగా పాటిస్తామని తెలిపారు. కేంద్రం చెప్తున్న మాటలకు వారి ఆదేశాలకు మద్య పొంతన లేదని చెప్పారు.

సర్క్యులర్లను విడుదల చేసేముందు రాష్ట్రాలను కేంద్రం సంప్రదించాలని మమత సూచించారు.  కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్లను అకస్మత్తుగా విడుదల చేస్తుందని అన్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో లాక్ డౌన్ మే 3 న ముగుస్తుందని అయితే కొంత మంది ముఖ్య మంత్రులు లాక్ డౌన్ ను పొడిగించాలని అంటున్నారని… బెంగాల్ లో మాత్రం ఇప్పటివరకు 696 కోవిడ్ కేసులు నమోదయ్యాయని చెప్పింది మమత. సోమవారం పొద్దున ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌కు మమత హాజరుకాలేదు. అయితే తమ ప్రభుత్వం లాక్ డౌన్ కు అనుకూలంగా ఉందని చెప్పారు.