దెబ్బతిన్న పంట ఎంత... కొన్న ధాన్యం ఎంత?.. చంద్రబాబు ట్వీట్

దెబ్బతిన్న పంట ఎంత... కొన్న ధాన్యం ఎంత?.. చంద్రబాబు ట్వీట్

రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన.. రేపు పెను ఉప్పెన అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఆ ఉప్పెనలో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్టుకుపోతుందన్న ఆయన.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.

రబీకి పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణాలు ఏంటి? అని చంద్రబాబు నిలదీశాలు. అకాల వర్షాల వల్ల అన్నదాతకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎక్కడ? దెబ్బతిన్న పంట ఎంత... కొన్న ధాన్యం ఎంత? అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతును ఆదుకోడానికి రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్, ఇప్పుడు ఎక్కడ ముడుచుకుని కూర్చున్నాడు? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరకు కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదు? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఈ నెల 12న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కి.మీ. మేర రైతు పోరుబాట పేరుతో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారని అంతకుముందుకు మాజీ మంత్రి పీతల సుజాత, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రకటించారు. మే 11న రాత్రి 8గంటలకు ఉండవల్లి నుంచి ఇరగవరం గ్రామానికి చేరుకుని అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బస చేస్తారని మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మే 12న ఉ.8గంటలకు ఇరగవరంలో పాదయాత్ర ప్రారంభించి గోటేరు, గోపాలపురం మీదుగా తణుకు చేరుకుంటారని స్పష్టం చేశారు. సాయంత్రం ఆరింటికి ఆకుల శ్రీరాములు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రైతులతో బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు.

https://twitter.com/ncbn/status/1656496808124911616