రోజుకు రెండు సార్లు బ్రష్​ ఎందుకు చేయాలో  తెలుసా...

రోజుకు రెండు సార్లు బ్రష్​ ఎందుకు చేయాలో  తెలుసా...

చాలా మంది రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తారు. కొంతమంది మాత్రమే రోజుకు రెండు సార్లు అంటే ఉదయం, రాత్రి పూట బ్రష్ చేస్తుంటారు. ఇలా రోజుకు రెండు సార్లు బ్రష్ చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.....

మన నోటిని, నాలుకను బట్టే ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటారు డాక్టర్లు.  అందుకే ఏదైనా సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన వెంటనే.. వైద్యులు ముందుగా నోరు తెరవమని  పరిశీలిస్తారు.  మన నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని తొలగించకపోతే నోట్లో నుంచి దుర్వాసన రావడంతో పాటుగా ఎన్నో రోగాలు కూడా వస్తాయి. అందుకే రోజూ బ్రష్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం మంచి అలవాటని చెప్తారు. 

బ్రష్ చేయడం అనేది రోజూ చేసే పనుల్లో ఓ పనిలా మాత్రమే చూస్తాం కానీ దానికి మన ఆరోగ్యానికి, దంత శుభ్రతకు సంబంధం ఉన్నదని ఏమాత్రం ఆలోచన ఉండదు. శరీరంలో అన్ని అవయవాల మీదా చూపించే శ్రద్ధలో నిజానికి దంతాల మీద చూపించే శ్రద్ధ కాస్త తక్కువే. సరిగ్గా చెప్పాలంటే నోటి శుభ్రత, ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే మన శరీరం శక్తిని పొందగలదు. ఎందుకంటే ఆహారం నోటి ద్వారానే తీసుకుంటాము.

Also Read: నిద్ర తక్కువైతే జంబలకడి పంబే.. మగాళ్లలో ఆడోళ్ల లక్షణాలు వస్తాయా..!

కావిటీస్ నివారణ

రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం వల్ల నోట్లోని చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండదు. అలాగే పళ్లలో ఇరుకున్న ఆహార కణాలు కూడా తొలగిపోతాయి. ఫలకంలో ఉండే బ్యాక్టీరియా దంతాల ఎనామెల్ ను నాశనం చేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది దంతక్షయానికి కారణమవుతుంది. అందుకే రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తే ఈ సమస్యలేవీ రావు.

చిగుళ్ల వ్యాధి నివారణ

మనం బ్రష్ సరిగ్గా చేయకుంటే చిగుళ్ల వ్యాధి వస్తుంది. అలాగే సంక్రమణ ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఒకవేళ మీకు చిగుళ్ల వ్యాధి వస్తే.. దాన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోకపోతే పంటి నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ టూత్ బ్రష్

ప్రస్తుత కాలంలో చాలా మంది మనం రెగ్యులర్ గా వాడే టూత్ బ్రష్ లకు బదులుగా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లనే వాడుతున్నారు. మనం వాడే మాన్యువల్ టూత్ బ్రష్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లే మంచివని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి మన నోటిని బాగా శుభప్రరుస్తాయి. అలాగే ఇవి సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. రోజుకు రెండు పూటలా బ్రష్ చేయడం వల్ల దంత సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే నోరు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే దీనితో పాటుగా అప్పుడప్పుడు దంత పరీక్షలు కూడా ఖచ్చితంగా చేయించుకోవాలంటారు నిపుణులు. దీనివల్ల ఏదైనా సమస్యను ముందుగానే గుర్తించొచ్చు. 

దంతాల నష్టాన్ని నివారిస్తుంది

సరిగ్గా పళ్లు తోముకోవడం వల్ల దంతాల ఫలకం, బ్యాక్టీరియా తొలగిపోతాయి. దీంతో దంత క్షయం, చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీంతో దంత నష్టం జరిగే అవకాశం కూడా ఉండదు. అందుకే ప్రతి రోజూ రెండు సార్లు పళ్లు తోముకోండి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది.

టూత్‌పేస్ట్ బ్రష్ మీద వేసే ముందు తడిగా ఉండకూడదు..

టూత్‌పేస్ట్‌ను వేయడానికి ముందు టూత్‌బ్రష్‌ను తడి చేయడం చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే, టూత్‌పేస్ట్‌ను పలుచగా మారుతుంది. బ్రష్ తడిచేయకుండా వేసినట్లయితే పెస్ట్ గట్టిగా ఉంది త్వరగా కరగదు. పళ్ళకు పట్టి తోమిన కాసేపటికి నురుగు వస్తుంది. అదే బ్రష్ తడిపి టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేస్తే, అది వేగంగా నురుగు వచ్చి త్వరగా కరిగిపోతుంది. టూత్‌పేస్ట్ దంతాలపై ఎక్కువసేపు ఉండాలంటే, బ్రష్ తడిగా ఉండకూడదు.

ఒత్తిడితో బ్రష్​ చేయకూడదు..

పళ్లు తోమే విధానంలో కాస్త సున్నితత్వం ఉండాలి. మరీ ఒత్తిడి చేసి దంతాలను శుభ్రం చేయడం వల్ల చిగుళ్లకు హానికలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దంతాలను శుభ్రం చేయడంలో సరైన బ్రష్‌ను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం.

రోజులో రెండుసార్లు బ్రష్

రోజుకు రెండు సార్లు బ్రష్ కాకుండా ఒకసారి బ్రష్ చేసినా సరిగా ఒత్తిడి లేకుండా చేయాలి. ఒత్తిడితో ఎక్కువసేపు బ్రష్ చేయడం దంతాలకు మంచిది కాదు. ఇది చిగుళ్ళ సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది.

రాత్రిపూట బ్రష్ చేయడం ఎందుకు ముఖ్యం..

నిద్రపోతున్నప్పుడు నోటిలో లాలాజలం తక్కువగా ఉంటుంది. పగటిపూట తిన్న ఆహారం పళ్ళలో ఉండి రాత్రంతా పాడైపోతుంది. ఇది నోటి దుర్వాసనతో పాటు పెద్ద సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి రాత్రి బ్రష్ తరవాత దంతాలు, నోరు శుభ్రంగా ఉంటాయి.