ఫోన్‌‌పే,పేటీఎం, గూగుల్‌‌‌పేలకు పైసలెట్ల?

ఫోన్‌‌పే,పేటీఎం, గూగుల్‌‌‌పేలకు పైసలెట్ల?

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు:  మొబైల్‌‌‌‌ రీఛార్జ్‌‌‌‌ చేయాలంటే ఫోన్‌‌‌‌పే లేదా పేటీఎం ఓపెన్ చేయడం.. డన్ ..రీఛార్జ్‌‌‌‌ అయిపోతుంది. షాపులో సామాన్లు తీసుకున్నారా? క్యూఆర్‌‌ కోడ్ స్కాన్ చేయడం..డన్ పేమెంట్ అయిపోతుంది.  కరోనా ఎఫెక్ట్ కావొచ్చు, ఇంకొకటి కావచ్చు మొబైల్  పేమెంట్ సర్వీస్‌‌‌‌లను అందిస్తున్న యాప్‌‌‌‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ఒక్క స్టేట్‌‌‌‌ బ్యాంక్ మినహా ఇంక ఏ ఇతర బ్యాంకుకు కూడా ఫోన్‌‌‌‌పే, గూగుల్‌‌‌‌ పేకి ఉన్నంత కస్టమర్ల బేస్‌‌‌‌ లేదనే చెప్పాలి. కానీ, ఈ యాప్‌‌‌‌లు పేమెంట్ ట్రాన్సాక్షన్లపై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదే! వీటికి రెవెన్యూ ఎలా వస్తోందని చాలా మంది ఆలోచిస్తుంటారు.  పేటీఎం, మొబిక్విక్ వంటి కంపెనీలు త్వరలో ఐపీఓకి రావాలని కూడా చూస్తున్నాయి. అందువల్ల ఈ కంపెనీలకు రెవెన్యూ ఎలా వస్తోందో తెలుసుకోవాల్సిన అవసరం ఇన్వెస్టర్లకు ఉంది.

బ్రాండ్ల నుంచి కమీషన్‌‌‌‌.. 

పేమెంట్ సర్వీస్‌‌‌‌ కంపెనీలకు బ్రాండ్ల నుంచి కమీషన్‌‌‌‌లు వస్తాయి. అంటే పేటీఎం ద్వారా ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ నెంబర్‌‌‌‌‌‌‌‌ రీఛార్జ్ చేస్తే, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ పేటీఎంకు కొంత కమీషన్‌‌‌‌గా ఇస్తుంది. కస్టమర్లు బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌, డీటీహెచ్‌‌‌‌ వంటి రీఛార్జ్‌‌‌‌లు చేసినప్పుడు కూడా మొబైల్ పేమెంట్ సర్వీస్‌‌‌‌ కంపెనీలకు కమీషన్ అందుతుంది. కంపెనీలతో డైరెక్ట్‌‌‌‌గా ఈ యాప్‌‌‌‌లు లింక్ అవుతాయి కాబట్టి కమీషన్ల కింద పెద్ద మొత్తంలో రెవెన్యూ అందుతుంది. భారత్‌‌‌‌ బిల్ పేమెంట్ సిస్టమ్‌‌‌‌ (బీబీపీఎస్)  ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లపై మొబైల్‌‌‌‌ పేమెంట్ సర్వీస్‌‌‌‌ కంపెనీలకు దక్కే  కమీషన్‌‌‌‌ తగ్గుతోంది. ఈ మధ్య యాప్‌‌‌‌లలో యాడ్‌‌‌‌ అవుతున్న కుకింగ్ గ్యాస్‌‌‌‌ బుకింగ్‌‌‌‌, మున్సిపాలిటీ ట్యాక్స్‌‌‌‌లు, స్కూల్‌‌‌‌ ఫీజులు వంటి ట్రాన్సాక్షన్లు బీబీపీఎస్‌‌‌‌ ద్వారా జరుగుతున్నాయి. కానీ, పేమెంట్ సర్వీసెస్‌‌‌‌ యాప్‌‌‌‌లలో ఇప్పటికీ మొబైల్‌‌‌‌, బ్రాడ్ బ్యాండ్‌‌‌‌, డీటీహెచ్‌‌‌‌ రీఛార్జ్‌‌‌‌లదే హవా. యాప్‌‌‌‌లు కస్టమర్లకిచ్చే క్యాష్ బ్యాక్‌‌‌‌లను తగ్గించుకుంటే రెవెన్యూ మిగులుతుంది. ఈ క్యాష్ బ్యాక్‌‌‌‌లను కూడా కంపెనీలు తమ అకౌంట్‌‌‌‌ బుక్‌‌‌‌లో మార్కెటింగ్ ఖర్చులుగా లిస్ట్ చేస్తాయి తప్ప రెవెన్యూ నష్టపోయామని రికార్డ్ చేయవని గుర్తుంచుకోవాలి.

రివార్డులతో రెవెన్యూ..

ఫోన్‌‌‌‌పే, పేటీఎం, గూగుల్‌‌‌‌ పే వంటి యాప్‌‌‌‌ల ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే రివార్డులు, క్యాష్ బ్యాక్‌‌‌‌లు వస్తుంటాయి.  రివార్డులు కూడా వేరే  కంపెనీ ప్రొడక్ట్‌‌‌‌పై డిస్కౌంట్‌‌‌‌గా ఇస్తున్నారు.  ఈ డిస్కౌంట్‌‌‌‌ కోసం  కూడా కంపెనీలు ఖర్చుచేస్తాయి. కొన్ని సార్లు పేమెంట్ యాప్‌‌‌‌లతో కలిసి కంపెనీలు ఈ డిస్కౌంట్లను ఇస్తాయి. కస్టమర్లు యూపీఐ ద్వారా కాకుండా చేసే  ట్రాన్సాక్షన్‌‌‌‌పై  పేమెంట్ యాప్‌‌‌‌లకు కమీషన్ అందుతుంది. 

టికెట్ సర్వీస్‌‌‌‌లు..

పేటీఎంలో సినిమా టికెట్లు, ఈవెంట్ టికెట్లు, ఫ్లైట్‌‌‌‌, ట్రైన్‌‌‌‌, బస్‌‌‌‌ టికెట్లను బుక్‌‌‌‌ చేసుకోవచ్చు.  ఫోన్‌‌‌‌పే, అమెజాన్‌‌‌‌లు కూడా టికెట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అందిస్తున్నాయి. కానీ, ఈ కంపెనీలు ఇందుకోసం మేక్‌‌‌‌మై ట్రిప్‌‌‌‌, క్లియర్‌‌‌‌‌‌‌‌ట్రిప్‌‌‌‌, బుక్‌‌‌‌మైషో, రెడ్‌‌‌‌బస్‌‌‌‌, యాత్ర వంటి కంపెనీలతో డీల్స్​ కుదుర్చుకుంటున్నాయి. అంటే వచ్చే కమీషన్‌‌‌‌ను  అమెజాన్‌‌‌‌, ఫోన్‌‌‌‌పే వంటివి ఈ కంపెనీలతో షేర్ చేసుకోవాల్సి వస్తోంది. పేటీఎం డైరెక్ట్‌‌‌‌గా ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌ కంపెనీలు, ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీ, సినిమా ఎగ్జిబిటర్స్‌‌‌‌తో లింక్ అయి టికెట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అందిస్తోంది. 

యాప్‌‌‌‌లలో స్టోర్లు

ఫోన్‌‌‌‌పే, గూగుల్‌‌‌‌ పే, పేటీఎం వంటి యాప్‌‌‌‌లలో స్విచ్‌‌‌‌, స్పాట్‌‌‌‌, మిని స్టోర్ వంటి ఫీచర్లు ఉంటున్నాయి. ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌ ద్వారా లోకల్‌‌‌‌గా ఉండే షాపులు, బిజినెస్‌‌‌‌లలో కస్టమర్లు ప్రొడక్ట్‌‌‌‌లు కొనడానికి వీలుంటుంది. ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఈ స్టోర్లలో కస్టమర్లు ఏవైనా ప్రొడక్ట్‌‌‌‌లు కొంటే వాటిపై ఈ యాప్‌‌‌‌లకు కమీషన్ అందుతుంది. పేటీఎం వంటి కంపెనీలు  లోన్లు, ఇన్సూరెన్స్‌‌‌‌, డిజిటల్ గోల్డ్‌‌‌‌, మ్యూచువల్‌‌‌‌ ఫండ్స్ వంటి అన్ని రకాల పేమెంట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అందిస్తున్నాయి. వీటి నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. పేమెంట్ సర్వీసెస్‌‌‌‌ యాప్‌‌‌‌లలో యాడ్స్‌‌‌‌ కూడా వస్తుండడం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఈ కంపెనీలకు వచ్చే యాడ్ రెవెన్యూ తక్కువైనప్పటికీ, ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో యాడ్స్ వలన రెవెన్యూ పెరగొచ్చు. ‘బై నౌ పే లేటర్‌‌‌‌‌‌‌‌’, ఈఎంఐ వంటి సర్వీస్‌‌‌‌లను కూడా పేమెంట్ సర్వీస్ కంపెనీలు అందిస్తున్నాయి.