
Kunal Shah Row: కునాల్ షా ఫిన్‌టెక్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన తీసుకొచ్చిన క్రెడ్ చెల్లింపుల యాప్ లక్షల మందిని క్రమం తప్పకుండా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తున్నందుకు రివార్డ్స్ అందిస్తూ ఫేమస్ అయ్యింది. డిజిటల్ చెల్లింపుల నుంచి ఇతర అన్ని పేమెంట్స్ పై రివార్డ్స్ ఖచ్చితందా అందిస్తున్న ఏకైక సంస్థగా క్రెడ్ నిలిచింది.
అయితే తాజాగా కునాల్ షాపై డెలాయిట్ కన్సల్టెంట్ ఆదర్ష్ సమలోపనం లింక్డిన్ పోస్టు వైరల్ అయ్యింది. కునాల్ షా 2010లో ఫ్రీచార్జ్ సహ వ్యవస్థాపకుడిగా.. అది 2015లో రూ.35 కోట్ల ఆదాయానికి చేరుకుంది. ఈ క్రమంలో కంపెనీ అందించిన క్యాష్ బ్యాక్స్ కారణంగా రూ.269 కోట్లు కంపెనీ నష్టపోయింది. అయితే తర్వాత దీనిని స్నాప్ డీల్ రూ.2వేల 800 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ స్నాప్ డీల్ ఫ్రీచార్జ్ సంస్థను కేవలం రూ.370 కోట్లకే యాక్సిస్ బ్యాంకుకు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు ఆదర్ష్.
తర్వాత 2018లో క్రెడ్ సంస్థను స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.4వేల 493 కోట్ల ఆదాయాన్ని కంపెనీ చూడగా.. రూ.5వేల 215 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించాడు ఆదర్ష్. కునల్ వ్యాపారవేత్తగా తన 15 ఏళ్ల ప్రయాణంలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా లాభాలను సంపాదించలేదని.. అలాంటప్పుడు ఆయన ప్రయాణంపై ఎందుకు గర్వించాలని ప్రశ్నించాడు. వ్యాపారవేత్తగా కునాల్ షాకు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో చెప్పాలని కోరాడు.
►ALSO READ | ఎయిర్ టెల్, జియో కస్టమర్లకు షాక్ : రీఛార్జ్ ధరలు భారీగా పెంచటానికి రెడీగా ఉన్నారు..!
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. స్టార్టప్ ప్రపంచంలో సక్సెస్ ఎవరు డేర్ చేసి రూల్స్ మార్చేందుకు ముందడుగు వేస్తారన్నదే ముఖ్యమని అన్నాడు. తన ప్రయాణంలో కునాల్ షా కేవలం కంపెనీలను మాత్రమే సృష్టించలేదని.. మార్కెట్లలోని వ్యాపార సరళిని, పద్ధతిని ఆయన మార్చగలిగారని అందుకే సెలబ్రేట్ షా ప్రయాణాన్ని సెలబ్రేట్ చేయాలని సదరు యూజర్ చెప్పారు.
అయితే ఈ మెుత్తం వ్యవహారంపై నేరుగా కునాల్ షా స్పందించటం గమనార్హం. ఆదర్ష్ చెప్పింది వాస్తవమేనన్నారు షా. అయితే ఈ క్రమంలో బయటి నుంచి రుణాలు తీసుకోకుండా వ్యాపారాలను లాభదాయకంగా నడిపిస్తున్న వేల మంది వ్యాపారవేత్తల ప్రయాణాన్ని కొనియాడాలన్నారు. తమ జీవితాన్ని రిస్క్ చేస్తూ వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్కరిని కొనియాడాలని చెప్పారు. ఎందుకంటే ఏఐ రాక తర్వాత ప్రపంచం మెుత్తం ఉద్యోగాలు పొందటం కష్టంగా మారుతుందని. ఏఐ రాక తర్వాత పరిస్థితులను ఎదుర్కోవటానికి ఉద్యోగాలను కల్పించే వ్యాపారవేత్తల అవసరం మరింతగా పెరుగుతుందని కునాల్ షా తన పోస్టులో పంచుకున్నారు.
కునాల్ షా ప్రయాణంపై క్యాష్ క్రై సంస్థ సీఈవో భరత్ ప్రతాప్ సింగ్ కూడా స్పందించారు. షా నిర్మించిన క్రెడ్ యాప్ భారత డిజిటల్ చెల్లింపులతో పాటు క్రెడిట్ వినియోగాన్ని పెంచగలిగిందన్నారు. షా తన వ్యాపార ప్రయాణంలో పెట్టుబడిదారులకు లాభాలను అందించగలిగారని, ఉద్యోగాలు కల్పించగలిగారని, ఒక జనరేషన్ మెుత్తాన్ని పెద్దగా ఆలోచించనల దిశగా పయనించేలా ప్రేరేపించారని చెప్పారు. మరికొందరు మాత్రం అమెజాన్ లాంటి సంస్థలే ఇప్పుడున్న స్థాయికి చేరుకోవటానికి ముందు భారీగా నష్టాలను చూశాయని.. షా దూరదృష్టితో కంపెనీని విజయపథంలో నడిపించేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.