చంద్రుడి క్లోజప్ చిత్రాలను పంపిన విక్రమ్ ల్యాండర్.. ఫొటోలు ఎలా తీసిందంటే...

చంద్రుడి క్లోజప్ చిత్రాలను పంపిన విక్రమ్ ల్యాండర్.. ఫొటోలు ఎలా తీసిందంటే...

చంద్రయాన్‌-3.. చందమామపై  విక్రమ్‌ ల్యాండర్‌   చంద్రుడి క్లోజప్   చిత్రాలను విక్రమ్ ల్యాండర్ తీసి పంపింది. దక్షిణ ధృవంపై ఉన్న పరిస్థితులను ఫొటోలను తీస్తూ ఎప్పటికప్పుడు  బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి సెండ్‌ చేసింది. . విక్రమ్‌ ల్యాండర్‌ పంపిన ఫొటోలను మీడియాకి రిలీజ్‌ చేసింది ఇస్రో. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయ్‌!. ఈ ఫొటోలన్నీ బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉన్నాయి. మొత్తం 14రోజులపాటు నిరంతరాయంగా ఫొటోలు పంపనుంది విక్రమ్‌ ల్యాండర్‌.విక్రమ్‌ ల్యాండర్‌ దక్షిణ ధృవం నుంచి నిరంతరాయంగా పనిచేస్తూ.. అక్కడి సమాచారాన్ని చేరవేయనుంది.ల్యాండర్‌కు అమర్చిన హారిజాంటల్ వెలాసిటీ కెమెరా వీటిని క్లిక్ మనిపించింది. బెంగళూరులో గల ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్, మిషన్ ఆపరేషన్స్ సెంటర్‌కు పంపించింది.  తాము పంపించిన సిగ్నల్స్ మాత్రమే కాకుండా, ల్యాండర్ కూడా తన డేటా, ఫొటోలను  కూడా పంపిస్తోంది. ప్రగ్యాన్ రోవర్‌లోని రెండు పేలోడ్‌లు చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను పరిశీలిస్తాయి. అలాగే మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తించి సమాచారాన్ని విశ్లేషిస్తాయి.

విక్రమ్ ల్యాండర్ పంపించిన ఫొటోలు చంద్రుడి ఉపరితలంపై క్రేటర్లు (బిలం) స్పష్టంగా కనపిస్తున్నాయి. ఆ క్రేటర్ల పేర్లను కూడా ఇస్రో వెల్లడించింది. ఫ్యాబ్రీ క్రేటర్, గియార్డనో బ్రునో క్రేటర్, హర్కేబి జే క్రేటర్‌ ఫొటోలను తీసి విక్రమ్ ల్యాండర్ పంపించినట్లు ఇస్రో తెలిపింది. అయితే ఈ మూడు క్రేటర్లలో గియార్డనో బ్రునో అనేది చంద్రుడిపై ఇటీవలే గుర్తించిన అతిపెద్ద బిలాల్లో ఒకటి అని ఇస్రో పేర్కొంది. ఇక హర్కేబి జే క్రేటర్ వ్యాసం దాదాపు 43 కిలోమీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

విక్రమ్ ల్యాండర్ ఉపరితల ప్లాస్మా (అయాన్లు, ఎలక్ట్రాన్ లు) సాంద్రతను కొలుస్తుంది. చంద్రుడి ఉపరితలం ఉష్ణ లక్షణాల కొలతలను నిర్వహిస్తుంది. ల్యాండింగ్ సైట్ చుట్టూ భూ స్వభావాన్ని అంచనా వేస్తుంది. లూనార్ క్రస్ట్, మాంటిల్ నిర్మాణాలను పరిశీలిస్తుంది. సౌరశక్తితో నడిచే ల్యాండర్, రోవర్ చంద్రుని పరిసరాలనను అధ్యయనం చేయడానికి సుమారు 2 వారాల సమయం పడుతుంది. రోవర్ కేవలం ల్యాండర్ తో మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది. ల్యాండర్ భూమిపై ఉన్న శాస్త్రవేత్తలతో కనెక్షన్ కలిగి ఉంటుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్ ను కంటింజెన్సీ కమ్యూనికేషన్ రిలేగా కూడా ఉపయోగించవచ్చని ఇస్రో తెలిపింది. దక్షిణ ధృవంలో తిరుగుతూ చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన క్లియర్‌ పిక్చర్స్‌ను తీయనుంది రోవర్‌. చందమామపై వాతావరణం ఎలా ఉంది?, మంచు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయ్‌?, అక్కడి వాతావరణం మానవ మనుగడకు అనుకూలమా? కాదా?, ఇలా అనేక అంశాలపై అధ్యయనంచేసి ఎప్పటికప్పుడు ఫొటోలు పంపనుంది.