డిజిటల్ మీడియాలో రాణించాలంటే ఈ స్కిల్స్ తప్పనిసరి

డిజిటల్ మీడియాలో రాణించాలంటే ఈ స్కిల్స్ తప్పనిసరి

న్యూఢిల్లీ: డిజిటల్ మీడియా రంగానికి ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ సెక్టార్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది దీన్ని కెరీర్గా ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 420 కోట్ల సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. అందుకే పాపులర్ రంగాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. ప్రముఖ వ్యాపార సంస్థలు డిజిటల్ మీడియా మార్కెటింగ్పై భారీగా ఆధారపడుతున్నాయి. అయితే సాధారణ ప్రింట్, బ్రాడ్ కాస్టింగ్ మీడియాతో పోల్చుకుంటే డిజిటల్ మీడియా మార్కెటింగ్ రంగం పూర్తిగా వైవిధ్యమైనది. అదే సమయంలో సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా రంగం భిన్నంగా ఉంటుంది. ఈ రంగంలో కెరీర్ను నిర్మించుకోవడానికి విద్యార్హతలతోపాటు స్కిల్స్, నైతిక విలువలు, అనుభవం, ఆసక్తులు, నెట్వర్కింగ్పై పట్టు సాధించాలి. 

వరల్డ్ వైడ్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారి శాతం ఎక్కువవుతోంది. ఉత్తర, పశ్చిమ యూరప్లోని జనాభాలో దాదాపు 79 శాతం మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని తేలింది. అదే విధంగా ఆగ్నేయ ఆసియాలోని జనాభాలో 69 శాతం మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. 53.6 శాతం జనాభా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. దీంతో డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్, వెబ్, యాప్ డెవలప్మెంట్, గ్రాఫిక్ గేమ్ డిజైనింగ్ లాంటి డిజిటల్ మీడియా స్కిల్స్ ఉన్న వారికి బాగా డిమాండ్ పెరిగింది. క్రౌడ్ ఫండింగ్, హెల్త్ కేర్, ఫైనాన్స్, రిటైల్ తోపాటు ఎడ్యుకేషన్ సెక్టార్ లోనూ డిజిటల్ మీడియా ఎక్స్పర్ట్స్కు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. డిజిటల్ మీడియా కోర్సు చేసిన వారు.. డిజిటల్ జర్నలిస్టులు, డిజిటల్ ఫొటోగ్రాఫర్స్, వెబ్ కంటెంట్ రైటర్స్, కంటెంట్ డెవలపర్స్, సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్స్, వీడియో డిజైనర్స్, ఎడిటర్స్, ఇల్లస్ట్రేటర్స్ లాంటి ఉద్యోగాలు చేయొచ్చు. 

డిజిటల్ జర్నలిస్టుగా ఎదగాలంటే..
డిజిటల్ జర్నలిస్టు అవ్వాలంటే జర్నలిజంలోని ప్రాథమిక విషయాలు తెలుసుకోవడంతోపాటు డిజిటల్ మీడియా టూల్స్పై అవగాహనను పెంచుకోవాలి. కంటెంట్ రైటింగ్ విషయంలో రీడర్స్ను దృష్టిలో ఉంచుకుని రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. డిజిటల్ జర్నలిస్టులు ఎక్కువగా వెబ్ సైట్లు, న్యూస్ ఆర్గనైజేషన్ల కోసం పని చేస్తుంటారు. ఈ రంగంలో విజయం సాధించాలంటే పాఠకుల అభిరుచులు, ఆసక్తులు, వార్త ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా చెప్పగలిగేలా రాయడం ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే రాసే ముందు నిజానిజాలను నిర్ధారించుకోవడం, కంటెంట్లో వాడిన ఫొటోలు, రాసిన టెక్స్ట్ను సరిచూసుకోవడం ఉత్తమం. డిజిటల్ జర్నలిస్టులు ప్రత్యేకంగా బిజినెస్, ఎడ్యుకేషన్, గ్లామర్, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ తోపాటు స్పోర్ట్స్, సినిమా రంగాల్లో జరిగే హ్యాపెనింగ్స్, అప్ డేట్స్, విశేషాల గురించి సమగ్రంగా రిపోర్ట్స్ రాసే బాగా రీచ్ ఉంటుంది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న వారి కోసం కొన్ని మీడియా స్కూళ్లు బీఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ప్రోగ్రాం, డిజిటల్ మీడియా స్పెషలైజేషన్ కోర్సులనూ ఆఫర్ చేస్తున్నాయి.

సాఫ్ట్వేర్స్పై పట్టు తప్పనిసరి
వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు న్యూస్, ఎంటర్ టైన్మెంట్ రంగాలతోపాటు డిజిటల్ మార్కెటింగ్ రంగంలోనూ కెరీర్ గ్రోత్కు అవకాశాలు ఉన్నాయి. కంటెంట్కు అదనపు హంగులు అద్దడం, క్యాప్షన్స్ ఇవ్వడం వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్ల పనే. అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ లాంటి పలు సాఫ్ట్వేర్స్పై పట్టు తెచ్చుకోవాలి. ఈ రంగంలో ప్రవేశించేందుకు బీఎస్సీ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. వెబ్ డిజైనర్స్, డెవలపర్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. వెబ్ పేజ్ డిజైన్ చేయడంలో ప్రత్యేకంగా కొన్ని స్కిల్స్ ఉండాలి. యూఎక్స్, యూఐతోపాటు హెచ్ టీఎంఎల్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సర్వర్ మేనేజ్ మెంట్, కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, డిజిటల్ మార్కెటింగ్లో ట్రైనింగ్ తీసుకుంటే వెబ్ డిజైనర్లుగా ఎదగొచ్చు. 

డిజిటల్ మీడియా మార్కెటింగ్లో కెరీర్ గ్రోత్ కోసం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కంటెంట్ క్రియేషన్ వంటి స్కిల్స్ను నేర్చుకోవాలి. అలాగే కంటెంట్ రైటింగ్, డేటా అనాలిసిస్, విజువలైజేషన్, డిస్ప్లే అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ ఆటోమేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటి స్కిల్స్ను కూడా మెరుగుపర్చుకోవడం తప్పనిసరి. డిజిటల్ అండ్ మాస్ మీడియాలో బీఏ, డిజిటల్ మీడియాలో ఎంఏ, కోర్సులు ఈ రంగంలో అడుగిడేందుకు అవసరమైణ పాఠాల్ని నేర్చుకోవచ్చు. 

మరిన్ని వార్తల కోసం:

ఇకపై మదర్సాల్లోనూ జాతీయ గీతం పాడినంకే క్లాసులు

రూ.100 నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి