
- మరో 3 నెలలు పెంచిన ప్రభుత్వం
- పాన్-ఆధార్ లింక్ గడువు జూన్ చివరిదాకా
న్యూఢిల్లీ: ఇప్పటికీ ఆధార్‌కార్డుతో పాన్‌కార్డును లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాన్–-ఆధార్ లింక్ గడువు తేదీని జూన్ 30, 2023 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంత సమయం ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్ నెంబర్‌ను 2023 మార్చి 31లోగా పాన్ కార్డుకు లింక్ చేయాలని గతంలో తెలిపింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని, ఐటీఆర్‌లు ప్రాసెస్ కాబోవని హెచ్చరించింది.
బ్యాంకు సంబంధిత లావాదేవీలు కూడా చేయడం సాధ్యం కాదని పేర్కొంది. పాన్-–ఆధార్ లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని, రూ. 1000 చార్జీని కూడా తొలగించాలని రిక్వెస్టులు రావడంతో తాజా నిర్ణయం వెలువడింది. ఇదిలా ఉంటే, మార్చి 31, 2022కి ముందు ఆధార్–-పాన్ లింకింగ్ ఉచితంగా ఉండేది. ఏప్రిల్ 1, 2022 నుండి రూ. 500 వసూలు చేశారు. ఆ తరువాత జూలై 1, 2022 నుండి రూ. 1,000లకు పెంచారు. పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేశారో లేదో తెలుసుకోవడానికి ఐటీ డిపార్ట్‌మెంట్ తన వెబ్‌సైట్‌లో లింక్‌లను కూడా ఇచ్చింది.
ఆధార్-పాన్ కార్డ్ లింక్ అయిందో లేదా చెక్ చేయడం ఇలా?
1. ఆదాయపు పన్ను ఈ–-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి.-- https://www.income tax.gov.in/iec/foportal/ లింక్‌పై క్లిక్ చేయండి
2. హోమ్‌పేజీలో, క్విక్ లింక్‌లను ఎంచుకుని, ఆపై ఆధార్ స్టేటస్ను చెక్ చేయండి
3. ఇప్పుడు పాన్, ఆధార్ నంబర్‌లను నమోదు చేయాల్సిన రెండు ఫీల్డ్‌లు కనిపిస్తాయి
4. దీని తరువాత, ఒక పాప్-అప్ మెసేజ్ వస్తుంది. ఆధార్ పాన్ లింక్ అయి ఉంటే ‘‘మీ పాన్‌కార్డుతో ఆధార్ లింకింగ్ పూర్తయింది” అని మెసేజ్ కనిపిస్తుంది
5. మీ పాన్ ఆధార్ లింక్ చేయకుంటే, స్క్రీన్‌పై మెసేజ్ వస్తుంది. - పాన్ ఆధార్‌తో లింక్ కాలేదని, ఈ పనిని పూర్తి చేయడానికి దయచేసి '‘లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి”అనే రిక్వెస్ట్
కనిపిస్తుంది
6. అన్ని వివరాలు ఇచ్చాక ‘‘మీ ఆధార్-పాన్ లింకింగ్ రిక్వెస్ట్ వెరిఫికేషన్ కోసం యూఐడీఏఐకి వెళ్లింది. హోమ్ పేజీలోని 'లింక్ ఆధార్ స్టేటస్' లింక్‌పై క్లిక్ చేసి స్టేటస్ను తెలుసుకోండి”అంటూ మెసేజ్ వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా స్టేటస్ను చెక్ చేయడానికి 567678 లేదా 56161కు మెసేజ్ పంపాలి. లింకింగ్ పూర్తయితే ... అయిందనీ.. లేకుంటే కాలేదనీ రిప్లై వస్తుంది.