స్మార్ట్​ వాచ్​, రిస్ట్ బ్యాండ్..ఇలా క్లీన్ చేయాలి

స్మార్ట్​ వాచ్​, రిస్ట్ బ్యాండ్..ఇలా క్లీన్ చేయాలి

రోజూ కంప్యూటర్ వాడుతుంటారు. కానీ.. కొన్ని షార్ట్​ కట్స్, ఈజీ ట్రిక్స్ కొందరికి తెలియవు. ఒక్కోసారి ఇంపార్టెంట్​ వర్క్​ చేస్తున్నప్పుడు సడెన్​గా సిస్టమ్ స్ట్రక్ అవుతుంది. అప్పుడేం చేయాలి? స్టయిల్​ కోసం, రకరకాలుగా పనికొస్తుందని స్మార్ట్​ వాచ్​, రిస్ట్ బ్యాండ్ వాడుతుంటారు. మరి వాటిని క్లీన్ చేస్తున్నారా? రోజూ క్లీన్​ చేయడం కష్టం అంటున్నారా? అలాగని క్లీన్​ చేయకపోతే తిప్పలు చేతిలో పట్టుకుని తిరిగినట్టే మరి. 

కంప్యూటర్ స్ట్రక్ అయితే...

కంప్యూటర్​లో విండోస్10 లేదా11 వెర్షన్స్​లో కొన్నిసార్లు సడెన్​గా అప్లికేషన్స్ పనిచేయడం ఆగిపోతాయి. సిస్టమ్​ కూడా అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతుంది. అలాంటప్పుడు కంట్రోల్, ఆల్ట్​, డిలీట్​ కీస్​ని లేదా కంట్రోల్, షిఫ్ట్, ఎస్కేప్​ బటన్ ఒకేసారి నొక్కుతారు. వీటితోపాటు మరొక పని కూడా చేయొచ్చు. 

  • ఎమర్జెన్సీ రీస్టార్ట్​ ఆప్షన్ వాడొచ్చు. కంట్రోల్, ఆల్ట్​, డిలీట్​ కలిపి నొక్కినప్పుడు కనిపించే స్క్రీన్​ మీద లుక్, స్విచ్ యూజర్, సైన్​ ఆఫ్​, టాస్క్​ మేనేజర్ ఆప్షన్లు కనిపిస్తాయి. అవి కాకుండా, కింద ఎడమ వైపు మూలన పవర్ బటన్ ఉంటుంది. దీని ద్వారా సీక్రెట్ ఫంక్షన్స్ వాడొచ్చు. అందుకోసం కంట్రోల్​ నొక్కి పట్టి పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే ‘క్లిక్ ఓకే టు ఇమిడియెట్లీ రీస్టార్ట్​ ఎనీ అన్​సేవ్​డ్ డాటా విల్​ బీ లాస్ట్​’ అనే మెసేజ్​ కనిపిస్తుంది. ‘ఓకే’ బటన్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్ రీస్టార్ట్​ అవుతుంది. 
  • షట్ డౌన్​ విండోస్​ డైలాగ్​ బాక్స్​ యాక్సెస్ చేయడం ద్వారా పీసీని రీస్టార్ట్​ చేయొచ్చు. విండోస్, డి కీ​స్​ను కలిపి నొక్కాలి. తర్వాత ఆల్ట్​, ఎఫ్ కీ​ కలిపి నొక్కితే షట్​ డౌన్​ విండోస్​ బాక్స్ కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ మెనూలో రీస్టార్ట్​ ఆప్షన్​ సెలక్ట్​ చేసి, ఓకే బటన్​ని క్లిక్ చేయాలి. 
  • టాస్క్ బార్ మీద విండోస్​ గుర్తు క్లిక్​ చేసి, సెర్చ్​ బాక్స్​లో ‘సీఎండీ’ అని టైప్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్​ సింబల్​ మీద రైట్ క్లిక్​ చేసి, ‘రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్’ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. తర్వాత కమాండ్ ప్రాంప్ట్​లో షట్​డౌన్​ –---ఆర్​ అని టైప్​ చేసి రన్ చేయాలి. వార్నింగ్ మెసేజ్ కనిపిస్తే ‘క్లోజ్’ మీద క్లిక్ చేయాలి. పీసీ 60 సెకండ్స్​లో షట్​ డౌన్​ అయ్యి రీస్టార్ట్ అవుతుంది. 

స్మార్ట్​తో జాగ్రత్త

ఈ మధ్య స్మార్ట్​ వాచ్​లు, రిస్ట్ బ్యాండ్​లు ఎక్కువగా వాడుతున్నారు. వాడటం వరకు ఓకే కానీ వాటిని ఎప్పుడైనా శుభ్రం చేస్తున్నారా? లేదంటే లేనిపోని రోగాలు వస్తాయంటున్నారు రీసెర్చర్లు. అమెరికాకు చెందిన ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ (ఎఫ్​ఏయూ)కి చెందిన ఒక టీం ప్లాస్టిక్, రబ్బర్, క్లాత్, లెదర్, మెటల్ (గోల్డ్​, సిల్వర్) రిస్ట్ బ్యాండ్​ల మీద రీసెర్చ్ చేసింది. వీటిలో ఏ మెటీరియల్​ బ్యాక్టీరియాను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందో పరిశీలించారు. 95 శాతం రిస్ట్​ బ్యాండ్​ల మీద ప్రమాదకరమైన​ బ్యాక్టీరియా ఉంది. 

అందులో కూడా 85 శాతం స్టెఫైలోకోకస్ జాతికి చెందిన బ్యాక్టీరియా ఉంది. అది స్టెఫె ఇన్ఫెక్షన్​ కలిగిస్తుంది. దీనివల్ల చర్మం పై ఎరుపు రంగులో దద్దుర్లు రావడం, వాపు వంటివి కనిపిస్తాయి. అలాగే 60 శాతం ఇ–కొలి బ్యాక్టీరియా, 30 శాతం సూడోమోనస్ బ్యాక్టీరియా ఉందని తేలింది. ఇలాంటి బ్యాక్టీరియాలు న్యుమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్​ కలిగిస్తాయి. అయితే రబ్బర్, ప్లాస్టిక్ రిస్ట్ బ్యాండ్స్​లో ఎక్కువ మొత్తంలో బ్యాక్టీరియా ఉంది. 

కానీ... గోల్డ్, సిల్వర్ వంటి మెటల్ బ్యాండ్స్​ మీద చాలా తక్కువ బ్యాక్టీరియా ఉంది. కొన్నింటికైతే అసలు బ్యాక్టీరియానే అంటుకోలేదు. క్లాత్​> ప్లాస్టిక్‌> రబ్బర్ > లెదర్ > మెటల్ ‌– ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకుంటే ఇన్ఫెక్షన్లకు ఎలా దూరం ఉండాలో తెలిసిపోతుంది.

ఇలా చేస్తే... 

శుభ్రం చేసేందుకు లైజాల్ డిస్​ఇన్ఫెక్టెంట్ స్ర్పే, హాస్పిటల్స్​లో కామన్​గా వాడే ఆల్కహాల్​ వైప్స్​, యాపిల్ సిడార్ వెనిగర్ ఎఫెక్టివ్​గా పనిచేస్తున్నాయని ఆ రీసెర్చ్​ చెప్పింది. పై మూడు 30 సెకన్లలోనే 99.99శాతం బ్యాక్టీరియాను చంపేస్తున్నాయి. యాపిల్ సిడార్ వెనిగర్ మాత్రం బ్యాక్టీరియాను చంపేందుకు రెండు నిమిషాల టైం తీసుకుందట.