ట్విట్టర్ లో వీడియో ఆటో ప్లేను ఎలా డిసేబుల్ చేయాలంటే...

ట్విట్టర్ లో వీడియో ఆటో ప్లేను ఎలా డిసేబుల్ చేయాలంటే...

మీరు వై- ఫై లేదా మొబైల్ డేటా కనెక్ట్ అయిన వెంటనే ట్విట్టర్ లో వీడియోలు డిఫాల్ట్ గా ప్లే అవుతూ ఉంటాయి. అయితే వీటిని సెట్టింగ్స్ లో కొన్ని మెథడ్స్ ను యూజ్ చేసి డిసేబుల్ చేయవచ్చు.

వీడియోను ఆటో ప్లేను ఎందుకు డిసేబుల్ చేయాలంటే..

మొబైల్ ఇంటర్నెట్ డేటాను ఆదా చేయాలనుకునే యూజర్స్ కు ఇదొక మంచి అవకాశం. ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నపుడు ఆటో ప్లే ఆప్షన్ ను ఎప్పటికీ లేదా వై-ఫై మాత్రమే సెట్ చేస్తే.. కేవలం వైఫై కనెక్ట్ అయిన సమయంలోనే వీడియోలు ఆటో ప్లే చేయబడతాయి.

ఎలా చేయాలి..

  • మొదట ట్విట్టర్ సైట్ లేదా యాప్ ను ఓపెన్ చేసి, ఎడమ వైపు ఉన్న ప్రొఫైల్ పిక్ సింబల్ పై క్లిక్ చేయండి.
  • సైడుకు ఉన్న నావిగేషన్ మెనూపై క్లిక్ చేసి, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్ ను ఎంచుకోండి.
  • కిందికి స్ర్కోల్ చేసి యాక్సెసిబిలిటీ, డిస్ ప్లే అండ్ లాంగ్వేజెస్ బటన్ పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత డేటా యూసేజ్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి.
  • కిందికి స్ర్కోల్ చేసి వీడియో ఆటో ప్లై పై, కావల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • హై క్వాలిటీ వీడియోను ఎనేబుల్ చేసే బటన్ ను క్లిక్ చేసి, ప్లే బ్యాక్ ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయడానికి కావల్సిన ఆప్షన్ ను ఎంచుకోండి.
  • ఇదే తరహాలో ఇమేజెస్ ను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.