కరోనా టెస్ట్‌‌‌‌ ఎలా చేస్తారు?

కరోనా టెస్ట్‌‌‌‌ ఎలా చేస్తారు?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌‌‌ ఇప్పటికే 82 దేశాలకు పైగా వ్యాపించింది. 3 వేల మందికి పైగా బలితీసుకుంది. ఇండియాలోనూ మూడ్రోజుల కిందట ఇద్దరికి వైరస్‌‌‌‌ సోకినట్టు కేంద్రం వెల్లడించింది. తర్వాత రోజుకు ఆ సంఖ్య 28కి చేరింది. మరి ఇలాంటి మహమ్మారిని ఎట్ల గుర్తిస్తరు? అసలు జనం నుంచి శాంపిల్స్‌‌‌‌ ఎట్ల తీసుకుంటరు? ఏమేం తీసుకుంటరు? తీసుకున్నాక ఎట్ల స్టోర్‌‌‌‌ చేస్తారు? ల్యాబ్‌‌‌‌కు ఎట్ల పంపిస్తరు? ఎట్లా టెస్ట్‌‌‌‌ చేస్తరు?

శాంపిల్‌‌‌‌ ఎట్ల తీసుకుంటరు?

వైరస్‌‌‌‌ ఉందని అనుమానిస్తున్న వ్యక్తి నోటి నుంచి లాలాజలాన్ని సేకరిస్తారు. తడి దగ్గున్న వాళ్ల దగ్గర్నుంచి కఫాన్ని తీసుకుంటారు. కరోనా ఊపిరితిత్తులపై దాడి చేసే వైరస్‌‌‌‌ కాబట్టి ఇప్పటివరకైతే ఇతర బాడీ ఫ్లుయిడ్స్‌‌‌‌ను చెక్ చేసినట్టు ఆధారాల్లేవు. మలం, మూత్రం, రక్త పరీక్షలు అవసరం లేదు. ముందు ముందు వీటినీ పరీక్ష చేయొచ్చేమో.

శాంపిల్‌‌‌‌ ఎంత టైం వరకు పనికొస్తది?

శాంపుల్‌‌‌‌ తీసుకున్నాక స్టెరైల్‌‌‌‌ ట్యూబ్‌‌‌‌లో భద్రపరుస్తారు. అతి తక్కువ టెంపరేచర్‌‌‌‌ దగ్గర స్టోర్‌‌‌‌ చేస్తారు. తర్వాత నోటిఫై చేసిన ల్యాబ్‌‌‌‌కు పంపిస్తారు. ఇలా స్టోర్‌‌‌‌ చేసిన శాంపిల్‌‌‌‌ 72 గంటల వరకు ఉంటుంది. టెస్టింగ్‌‌‌‌కు ఎక్కువ టైం పడుతుందని తెలిస్తే స్టోరేజ్‌‌‌‌కు డ్రై ఐస్‌‌‌‌ను వాడుతారు. టెస్టింగ్‌‌‌‌కు ఎక్కువ టైం పడుతున్న కొద్దీ వైరస్‌‌‌‌ జెనెటిక్‌‌‌‌ మెటీరియల్‌‌‌‌ నాశనమవుతుంది. టెస్ట్‌‌‌‌ నెగెటివ్ వస్తుంది.

ఎట్ల టెస్ట్‌‌‌‌ చేస్తరు?

నమూనా వచ్చాక టెస్టింగ్‌‌‌‌కు టెక్నీషియన్లు ఆర్టీ పీసీఆర్‌‌‌‌ (రివర్స్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌క్రిప్టేస్‌‌‌‌ పాలిమరైజ్‌‌‌‌ చైన్‌‌‌‌ రియాక్షన్‌‌‌‌) పద్ధతిని వాడుతారు. దీని ద్వారానే కరోనా వైరస్‌‌‌‌ ఉందో లేదో కనుక్కుంటారు. ఇదే టెస్ట్‌‌‌‌ను ఫ్లూ వైరస్‌‌‌‌ ఉందో లేదో తెలుసుకోవడానికి చేస్తారు. ప్రతి జీవికి ప్రత్యేకమైన డీఎన్‌‌‌‌ఏ ఉన్నట్టే ప్రతి వైరస్‌‌‌‌కు ప్రత్యేకమైన జెనెటిక్‌‌‌‌ కోడ్‌‌‌‌ ఉంటుంది. దీన్నే వైరల్‌‌‌‌ జీనోమ్‌‌‌‌ అంటారు. దీని ద్వారానే వైరస్‌‌‌‌ ఉన్నదీ లేనిది తెలిసిపోతుంది. సేకరించిన నమూనా నుంచి వైరస్‌‌‌‌ జీనోమ్‌‌‌‌ను వేరు చేసేందుకు రకరకాల పదర్థాలు కలుపుతారు. ఇందులో కొన్నింటిని కరోనా వైరస్‌‌‌‌ నుంచే తీసుకుంటారు.ఆ పూర్తి సొల్యూషన్‌‌‌‌ను టెస్టింగ్‌‌‌‌ మెషీన్‌‌‌‌ కింద పెడతారు. వైరస్‌‌‌‌ ఉన్నట్టు తేలితే జెనెటిక్‌‌‌‌ మెటీరియల్‌‌‌‌ విస్తరిస్తుంది.

ఎంత టైం తీసుకుంటది?

తక్కువలో తక్కువ 24 గంటల్లో రిజల్ట్‌‌‌‌ వస్తుంది. ఆ టైంలో పేషెంట్‌‌‌‌ను ఐసోలేషన్‌‌‌‌లో ఉంచుతారు.

సార్స్‌‌‌‌ 2 అంటున్నరు

ప్రస్తుతం కరోనా వ్యాప్తి స్టార్టింగ్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో ఉంది. ఈ వైరస్​ సార్స్‌‌‌‌ లక్షణాలను పోలి ఉందని నిపుణులు అంటున్నారు. సార్స్‌‌‌‌ 2 అని కూడా అంటున్నారు. మనుషుల శ్వాసకోస వ్యవస్థపై దాడి చేసి ప్రాణాలు తీస్తోంది కాబట్టే ఈ నిర్ణయానికొచ్చామని చెబుతున్నారు. ఇంకొందరేమో దగ్గు, జ్వరం ఉంది కాబట్టి కొత్త కరోనా వైరస్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫెక్టెడ్‌‌‌‌ నిమోనియా అని అంటున్నారు. అందరి అభిప్రాయం ప్రకారం వైరస్‌‌‌‌ శ్వాసవ్యవస్థపై దాడి చేసి ఊపిరి తీసుకోనీయకుండా ఇబ్బంది పెడుతోంది. కొన్ని కేసుల్లో అక్యూట్‌‌‌‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌‌‌‌ సిండ్రోమ్‌‌‌‌గా మారుతోంది. అంటే ఊపిరితిత్తుల్లోకి ద్రవం చేరుతుందన్నమాట. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందవుతుంది. వెంటిలేషన్‌‌‌‌పై పెట్టాల్సి వస్తుంది. చివరికి ప్రాణం తీస్తుంది.