స్మార్ట్​ ఫోన్​ హ్యాక్​ అయిందనేందుకు.. ఇవే సంకేతాలు

స్మార్ట్​ ఫోన్​ హ్యాక్​ అయిందనేందుకు.. ఇవే సంకేతాలు

ఒకవేళ ఫోన్​ హ్యాక్​ అయితే, వెంటనే ఫార్మాట్ చేయాలి లేదా ఫ్యాక్టరీ సెట్టింగ్స్​లో అయినా చేయొచ్చు. అయితే, ఆ టైంలో పొరపాటున కూడా ఫోన్​ బ్యాకప్​ తీయొద్దు. ఎందుకంటే బ్యాకప్​తోపాటు మాల్వేర్​ కూడా ఫోన్​లో ఇన్​స్టాల్ అవుతుంది. ఇంతకీ స్మార్ట్​ ఫోన్​ హ్యాక్​ అయిందనేందుకు ఇవే సంకేతాలు.

  •     ఫోన్​ స్లోగా పనిచేస్తుంది. 
  •     ఇంటర్నెట్ స్పీడ్​ బాగానే ఉన్నా, వాడటంలో ఇబ్బందులు వస్తాయి. 
  •     డాటా విపరీతంగా అయిపోతుంటుంది.
  •     ఆటోమెటిక్​గా ఫోన్ షట్ డౌన్​ అయిపోవడం లేదా ఆటోమెటిక్​గా రీస్టార్ట్​ అవుతుంటే.. మీ ఫోన్​ను హ్యాకర్ ఆపరేట్ చేస్తున్నట్టే.
  •     ఫోన్​ సెట్టింగ్స్​, యాప్స్​ ఆటోమెటిక్​గా మారుతుంటే మీ ఫోన్​ ఆల్రెడీ హ్యాకర్ల చేతికి చిక్కినట్టే. 
  •     బ్యాటరీ ఒక్కసారిగా డ్రెయిన్ అయిపోతున్నా కూడా హ్యాక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే హ్యాక్ అయ్యాక చాలా మాల్వేర్​, యాప్, డాటాను ప్రాసెస్ చేస్తారు హ్యాకర్లు. కాబట్టి బ్యాటరీ ఎక్కువ వాడతారు.