యాంకిల్‌‌‌‌ టచ్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయాలి

యాంకిల్‌‌‌‌ టచ్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయాలి

ఎక్కువసేపు కూర్చొని పని చేయడంవల్ల శరీరానికి కావాల్సిన వర్కవుట్‌‌‌‌ జరగట్లేదు. దానివల్ల చిన్న వయసులోనే పొత్తికడుపులో కొవ్వు పెరిగి, జీర్ణ సమస్యలు వస్తున్నాయి. ఆ కొవ్వును కరిగించాలని జిమ్‌‌‌‌లకు వెళ్తున్నారు చాలామంది. అలాంటివాళ్లు ఏ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ పడితే అది చేయకుండా ముందుగా ఈ బిగినర్స్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌లు చేయాలని చెప్తోంది ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ట్రైనర్‌‌‌‌‌‌‌‌ నమ్రతా పురోహిత్‌‌‌‌.

మోడిఫైడ్‌‌‌‌ సైడ్‌‌‌‌ ప్లాంక్‌‌‌‌
ఈ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయడం వల్ల శరీరం బ్యాలెన్స్‌‌‌‌డ్‌‌‌‌గా, కండరాలు బలంగా తయారవుతాయి. కుడి పక్కకు పడుకొని కుడి చేతి, కుడి కాలితో శరీరాన్ని పైకి ఎత్తి బ్యాలెన్స్ చేయాలి. అలానే ఎడమ పక్క కూడా చేస్తూ మోడిఫైడ్‌‌‌‌ సైడ్‌‌‌‌ ప్లాంక్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయాలి.

లెగ్‌‌‌‌ కిక్‌‌‌‌ ఆన్ ఎల్‌‌‌‌బో 
నేల మీద పడుకొని ప్లాంక్‌‌‌‌ పొజిషన్‌‌‌‌లోకి రావాలి. తరువాత ఫొటోలో చూపినట్టు కుడికాలు పైకి లేపి, ఎంత వీలైతే అంత  వెనక్కి అనాలి. అలానే ఎడమకాలితో కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల భుజాలు, పొత్తి కడుపు బలంగా తయారవుతాయి.

యాంకిల్‌‌‌‌ టచ్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌
నేల మీద పడుకొని కాళ్లు పైకి మడవాలి. తరువాత మెడ, ఛాతి భాగాన్ని పైకి ఎత్తి,  కుడి చేత్తో కుడికాలి పాదాన్ని అందుకోవాలి. అలానే ఎడమ పక్క కూడా చేయాలి. యాంకిల్‌‌‌‌ టచ్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయడం వల్ల నడుము దగ్గర చేరిన కొవ్వు కరుగుతుంది.

యాబ్‌‌‌‌ ప్రెప్‌‌‌‌ 
పొత్తి కడుపులో కొవ్వు కరిగించి, కండరాలను సాగేలా చేయడానికి ఈ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ సాయపడుతుంది. నేల మీద పడుకొని, మోకాళ్లు పైకి ఉండేలా కాళ్లు మడవాలి. రెండు చేతులు మెడకింద పెట్టాలి. తరువాత నెమ్మదిగా తల, ఛాతి భాగాన్ని లేపి, మోకాళ్లకు తల తగిలేలా ట్రై చేయాలి.