V6 News

Summer Special : మండే ఎండల్లో చల్లని పెరుగుతో వంకాయ పచ్చడి, బనానా స్మూతి, దహీ వడ ఎలా చేసుకోవాలంటే..!

Summer Special : మండే ఎండల్లో చల్లని పెరుగుతో వంకాయ పచ్చడి, బనానా స్మూతి, దహీ వడ ఎలా చేసుకోవాలంటే..!

సమ్మర్ హీట్ ని బీట్ చేయాలంటే డైట్ మెనూలో పెరుగు ఉండాలి. అందుకే ఈ వారం టేస్టీ అండ్ కూల్ కూల్ పెరుగు వంటలు.ఇవి ఒంటిని చల్లబర్చడమే కాదు జీర్ణశక్తిని పెంచుతాయి. బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. చర్మానికి మెరుపునిస్తాయి కూడా. ఎముకల బలానికీ చాలా మేలు చేస్తాయి. మరింకెందుకు ఆలస్యం పెరుగు వంటలు మొదలుపెట్టండి.

పెరుగు- బనానా స్మూత్

కావాల్సినవి

పెరుగు ఒక కప్పు అరటి పండు ఒకటి యాలకుల పొడి- చిటికెడు పంచదార- మూడు టీ స్పూన్లు  కుంకుమపూవు చిటికెడు  జీడిపప్పు పలుకులు తగినన్ని

ఇలా చేయాలి.

అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. అందులో పంచదార పెరుగు కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని గ్రాసులో పోసి కొద్దిసేపు ఫ్రిజ్ లో ఉంచి తీయాలి. తర్వాత కుంకుడు పువ్వు, జీడిపచ్చ పలుకులు కూడా వేస్తే కూల్ కూల్ పెరుగు స్మూత్ రెడీ

దహీ వడ

కావాల్సినవి

పెరుగు - అర లీటరు, ఉప్పు- తగినంత మినపప్పు- పావు కిలో, ఎండుమిర్చి-రెండు పంచదార - ఒక టీ స్పూన్ నూనె - డీప్ ఫ్రైకి సరిపడా జీలకర్ర పొడి - ఒక టీస్పూన్ పోష దినుసులు- ఒక టీ స్పూన్. ఉప్పు- తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు

ఇలా చేయాలి

ముందుగా మినపప్పుని రెండు గంటలు నానబెట్టి రుబ్బాలి. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పు వేసి బాగా కలిపి ఒక పదినిమిషాలు పక్కనుంచాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా పత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. వాటిని ఉప్పు, పంచదార కలిపిన గోరువెచ్చని నీళ్లలో కాసేపు నానబెట్టాలి. ఇప్పుడు మరొక బౌల్లో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో నానబెట్టిన వడలు వేయాలి. చివరిగా పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. ఆ మిశ్రమాన్ని వడలపై వేస్తే దహీ వడ రెడీ

వంకాయ పెరుగు పచ్చడి

కావాల్సినవి

పెరుగు - అర కిలో వంకాయలు- వంద గ్రాములు ఉప్పు - తగినంత పోపు దినుసులు- ఒక టీ స్పూన్ ఎండుమిర్న్- రెండు కరివేపాకు- రెండు రెమ్మలు జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్ కొత్తిమీర - కొద్దిగా నూనె- రెండు టేబుల్ స్పూన్

ఇలా చేయాలి

ముందుగా వంకాయలకు నూనె రాసి రెండు వైపులా కాల్చాలి. పైన తొక్క తీసి గుజ్జు తీయాలి. ఒక గిన్నెలో పెరుగు, వంకాయ గుజ్జు, ఉప్పు వేసి బాగా కలపాలి. పాన్లో నూనె వేడిచేసి పోవు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. ఆ పోపు మిశ్రమాన్ని వంకాయ పెరుగు

దహీ కబాబ్

కావాల్సినవి

గడ్డ పెరుగు-ఒక కప్పు, శెనగపిండి- అర కప్పు బియ్యం పిండి  పావు కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక టీ స్పూన్ ఉన్న కారం- తగినంత, పసుపు- చిటికెడు ఉల్లిగడ్డ తరుగు- ఒక టేబుల్ స్పూన్ పచ్చిమి తరుగు - అర టేబుల్ స్పూన్ గరం మసాలా- ఒక టీ స్పూన్  చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్  పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా  నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

ఇలా చేయాలి

గిన్నెలో గడ్డ పెరుగు సోనగపిండి, బియ్యప్పిండి.. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిరెడ్డి, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా చాట్ మసాలా పుదీనా, కొతిమీర వేసి బాగా కలపాలి.ఆ  మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కబబ్సులా వత్త కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఆపై చాట్ మసాలా మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే దహీ కబాబ్ రెడీ