కిచెన్ తెలంగాణ : తామర గింజల లడ్డు 

కిచెన్ తెలంగాణ : తామర గింజల లడ్డు 

తామర గింజల లడ్డు

కావాల్సినవి :

తామర గింజలు (ఫూల్​ మఖానా) – రెండు కప్పులు

నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు

నువ్వులు, పల్లీలు, బెల్లం –  ఒక్కోటి అర కప్పు చొప్పున

తయారీ : పూల్ మఖానా, నువ్వులు, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, పల్లీలు ఒకదాని తర్వాత ఒకటి నూనె లేకుండా దోరగా వేగించాలి. అవన్నీ చల్లారాక మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులో బెల్లం కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి గోరువెచ్చగా కాగిన నెయ్యి పోయాలి. తరువాత మిశ్రమాన్ని బాగా కలిపి, లడ్డూలు చేయాలి. ఈ లడ్డూలు రోజుకి ఒకటి తింటే చాలా హెల్దీ.