వరలక్ష్మీ వ్రతం నైవేద్యం : పంచామృతం 

వరలక్ష్మీ వ్రతం నైవేద్యం  : పంచామృతం 

శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి శుక్రవారం తలంటు స్నానాలు, కొత్త బట్టలు, పూజలు, ప్రసాదాలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు చేసే వరలక్ష్మీ వ్రతం రోజున అయితే ఇంట్లో ఆడవాళ్లు చేసే హడావిడి చెప్పక్కర్లేదు. పొద్దున్నే మహాలక్ష్మీలా తయారై పండుగ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేస్తారు. అందులో భాగంగా లక్ష్మీదేవికి ఎంతో రుచికరమైన నైవేద్యాలు వండి పెడతారు. నిజానికి పండుగ రోజు నైవేద్యాలు అన్న పేరే గానీ, ఇంత రుచికరమైన ఫుడ్​ని ఎప్పుడు చేసినా కాదంటారా! మరింకెందుకాలస్యం ఈసారి వ్రతానికి వీటిని తప్పకుండా ట్రై చేయండి. వాటిని ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. కచ్చితంగా తినాలనిపిస్తుంది. 

కావాల్సినవి :

అరటిపండు – ఒకటి

యాపిల్ ముక్కలు – పావు కప్పు

జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పలుకులు – అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్

పచ్చి కొబ్బరి తురుము –  ఒక టేబుల్ స్పూన్

నెయ్యి – ఒక టీస్పూన్

తేనె – రెండు టీస్పూన్లు 

యాలకుల పొడి – పావు టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో అరటిపండు, యాపిల్ ముక్కలు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం పలుకులు, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, తేనె, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తేనె బదులు చక్కెర లేదా బెల్లం కూడా వాడొచ్చు. పచ్చి కొబ్బరిని తురుములా కాకుండా ముక్కలు చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులో వేరే పండ్ల ముక్కలు కూడా కలపొచ్చు. లేదంటే ఒకే ఒక్క పండుతో కూడా ఈ ప్రసాదాన్ని చేయొచ్చు.