సజ్జ మత్రీ
కావాల్సినవి :
సజ్జపిండి – మూడు కప్పులు
మిరియాల పొడి, వాము – ఒక్కో టీస్పూన్ చొప్పున
జీలకర్ర, పసుపు – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
ఉప్పు – ఒకటింపావు టీ స్పూన్
కసూరీ మేథీ – ఒక టేబుల్ స్పూన్
వేరుశనగ నూనె – ముప్పావు కప్పు
నీళ్లు – ముప్పావు కప్పు
తయారీ : ఒక గిన్నెలో సజ్జ పిండి, వాము, జీలకర్ర, ఉప్పు, కసూరీ మేథీ, మిరియాల పొడి, పసుపు వేసి కలపాలి. అందులో వేరుశనగ నూనె పోసి మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దగా కలపాలి. ఈ ముద్దను ఒక గిన్నెలో పెట్టి పైన క్లాత్ కప్పి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత చేతులకు నూనె రాసుకుని, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. వీటిని బిస్కెట్లా వత్తి, ఫోర్క్‌తో గుచ్చితే చిన్న రంధ్రాలు పడతాయి. నూనె వేడెక్కాక బిస్కెట్స్‌లా చేసిన వాటిని అందులో వేగించాలి. కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు.