 
                                    ‘బాగా అలసిపోయానమ్మా ఈరోజు’.. ఆఫీస్ నుంచి రాగానే అమ్మతో చెప్పింది జాహ్నవి. ‘కాసేపు నిద్రపోమ్మా. అలసట అదే తగ్గిపోతుంద’ని సలహా ఇచ్చింది తల్లి. రాకేశ్ పొద్దంతా పని చేశాడు సాయంత్రం అవగానే ఓ కునుకు తీద్దాం అనుకున్నాడు. నిద్రపోతే అలసట తగ్గుతుందనేది అతని ఫీలింగ్. జాహ్నవి, రాకేశ్ మాత్రమే కాదు చాలామంది దాదాపు ఇలాగే అనుకుంటారు. అయితే, తీవ్రమైన అలసట నుంచి బయటపడడానికి నిద్ర ఒక్కటే మార్గం కాదంటున్నారు డాక్టర్లు. అలసట తీర్చుకోవడం అంటే మనసుకు, మెదడుకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం. అది నిద్రవల్లనే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా సాధ్యం అవుతుందని అంటున్నారు.
ఫిజికల్ రెస్ట్ 
జాబ్‌లో భాగంగా చాలామంది గంటలు గంటలు కూర్చుండే పని చేస్తుంటారు.  దాంతో  ఫిజికల్‌గా అలసిపోతారు.  చాలా సేపు కూర్చొని ఉండడం వల్ల బాడీపెయిన్స్ కూడా వస్తాయి. అయితే, మధ్యమధ్యలో  మెడ, చేతుల్ని  అటూ ఇటూ తిప్పడం వల్ల  డెస్క్ జాబ్స్ చేసేవాళ్లు  అలసట నుంచి బయటపడొచ్చని చెబుతున్నాడు అమెరికాకు చెందిన డాక్టర్ డాల్టన్ స్మిత్. గంటకొకసారి అయినా ఐదు పది అడుగులు నడవడం,  15 నిమిషాలు ప్రశాంతంగా ఉండటం వంటివి వర్క్ ఏరియాలో రెస్ట్ ఇచ్చే మార్గాలని అతను అంటున్నాడు. 
మెంటల్ రెస్ట్
ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి కొంతమంది మెంటల్‌గా అలసిపోతారు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, భయపడటం వల్ల మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది. దాంతో  కాన్సన్ట్రేషన్ దెబ్బ తింటుంది.  ఇలాంటి సిచ్యుయేషన్ నుంచి బయట పడాలంటే ముందుగా మనసును కంట్రోల్ చేసుకోవాలి.   సోషల్ మీడియాలో ఛాటింగ్, స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు చూడడం తగ్గించాలి. వీటి బదులు క్రియేటివ్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి.   పాజిటివ్ టాపిక్స్ గురించి ఆలోచించాలి.  ఇలాచేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు.  
సోషల్ రెస్ట్ 
ఒక వ్యక్తి లేదా గ్రూప్‌తో పడనప్పుడు, వాళ్లపై మంచి ఒపీనియన్ లేనప్పుడు అలాటివాళ్లకి పూర్తిగా దూరంగా ఉండటమే ‘సోషల్ రెస్ట్’ అంటున్నారు డాల్టన్ స్మిత్. ఇష్టమైన వాళ్లతో కలిసి తినడం, వాళ్లతో సినిమాలకు, పార్కులకు వెళ్లడం వల్ల రిలీఫ్ అనిపిస్తుంది.  క్లోజ్ ఫ్రెండ్స్‌తో ముఖ్యమైన విషయాలు చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం కూడా సోషల్ రెస్ట్‌లో భాగమే  అంటున్నాడు డాల్టన్. 
క్రియేటివ్ రెస్ట్ 
అలసిపోయిన బ్రెయిన్‌ను క్రియేటివిటీతో ఉత్తేజితం చేయొచ్చు.  కొత్త ఆలోచనలు టానిక్ లాంటివి. లైఫ్‌లో విశ్రాంతిని కోరుకునేవాళ్లు క్రియేటివిటీ పెంచుకోవాలి. పుస్తకాలు చదవడం, పెయింటింగ్స్ వేయడం,  సినిమాలు చూడటం,  న్యూస్‌పేపర్లు చదవడం... ఇవన్నీ క్రియేటివ్ రెస్ట్ కిందకే వస్తాయి అంటున్నాడు డాల్టన్.

 
         
                     
                     
                    