పండ్లు, కూరగాయలను ఇలా నిల్వ చేసుకోండి... తాజాగా ఉంటాయి...

పండ్లు, కూరగాయలను ఇలా  నిల్వ చేసుకోండి... తాజాగా ఉంటాయి...

ఒక్కసారి మార్కెట్‌కి వెళితే వారం రోజులు సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చేసుకుంటాం.. అయితే వాటిని నిల్వ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. చాలా రోజులు ఇవి తాజాగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం....

 

  • పచ్చిమిర్చి : పండకుండా ఎక్కువకాలం ఉండాలంటే వాటిలో కొంచెం పసుపు కలిపి స్టోర్ చేయాలి
  • క్యాబేజీ: క్యాబేజీ ఎక్కువసేపు ఉండాలంటే మూల భాగాన్ని కత్తిరించి తడి కాగితాన్ని ఆ స్థానంలో ఉంచండి. ఇది క్యాబేజీని తాజాగా ఉంచుతుంది.
  • పెరుగు : తొందరగా పులుస్తుంటే అందులో రెండు పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి
  • చేపలకూకూర: వాసన రాకుండా ఉండాలంటే .. ఉడికించేముందు చేపముక్కలను నిమ్మరసం లేదా వెనిగర్ తో కడగాలి
  • టమోటా: మొత్తబడితే  వాటిని రాత్రి సమయంలో ఉప్పు నీటిలో నానబెట్టాలి.
  • వేపుళ్లు: కొద్దిగా ఉప్పు ఎక్కువైతే .. అందులో కొన్ని ఉల్లిపాయలు తరిగి వేయాలి.
  • బియ్యం: మనం తినే అన్నంలో తరచుగా పురుగులు వస్తాయి. పురుగులు రాకుండా ఉండాలంటే ఒక చిన్న  అల్లం ముక్క, నక్షత్రపు పువ్వును బియ్యం లోపల ఉంచాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలో పురుగులు రావు.
  • బియ్యపు పిండి:  మిక్సీ పట్టేటప్పుడు టేబుల్ స్పూన్ చక్కెర కలిపితే పిండి తెల్లగా వస్తుంది
  • బెండకాయలు: తాజాగా లేకపోతే .. ఆ ముక్కల్లో కొద్దిగా నిమ్మరసం కలిపితే తాజాగా ఉంటాయి
  • కూరగాయలు: కడిగిన తరువాత తేమ పోయే వరకే ఆరబెట్టిన తరువాత ఫ్రిజ్ లో పెట్టాలి .
  • పచ్చి ఉల్లిపాయ: పచ్చి ఉల్లిపాయను పేపర్ టవల్‌లో చుట్టి, నీళ్లతో చిలకరిస్తే ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
  • అరటిపండు : కాండం భాగాన్ని తడి గుడ్డతో చుట్టాలి. ఇలా చేస్తే అరటిపండు ఎక్కువ కాలం చెడిపోదు.
  • కొత్తిమీర ఆకులు: కొత్తిమీర ఆకులు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే తడి పేపర్ టవల్ తో చుట్టాలి. తర్వాత గ్లాసులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఆకులు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి.
  • స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీలు ఫ్రిజ్‌లో పాడైపోతాయి. స్ట్రాబెర్రీలు చెడిపోకుండా ఉండాలంటే ఒక గిన్నెలో నీళ్లు, వెనిగర్ వేసి మరో గిన్నెలో స్ట్రాబెర్రీలను వేసి వెనిగర్ నీళ్లలో ముంచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల స్ట్రాబెర్రీలు పాడవ్వకుండా ఉంటాయి.
  • వాటర్ మెలోన్: పుచ్చకాయ చాలా పెద్దదైతే ఒక్కరోజులో తినలేం. అప్పుడు మేము దానిని ఫ్రిజ్లో ఉంచుతాము. అలా ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయలో బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పుచ్చకాయ పైన రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ప్లాస్టిక్ ర్యాప్ తో ప్యాక్ చేసి ఫ్రిజ్ లో ఉంచితే పుచ్చకాయ తాజాగా ఉంటుంది.

ALSO READ :ప్రయాణంలో వాంతులు వికారంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..