కర్ణాటక హోయసల ఆలయాలకు యునెస్కో గుర్తింపు .. ప్రధాని మోదీ ప్రశంసలు

కర్ణాటక హోయసల ఆలయాలకు యునెస్కో గుర్తింపు .. ప్రధాని మోదీ ప్రశంసలు

కర్ణాటకలోని హొయసల దేవాలయాలు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించాయి. తాజా ప్రకటించిన యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బేలూర్, హళేబీడ్, సోమనంతపురా ప్రాంతాల్లో ఉన్న ఈ చారిత్రక దేవాలయాలను UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ 2023 జాబితాలో  చేర్చారు. 

ప్రపంచ వారసత్వ జాబితాలో హొయసల దేవాలయాలు చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు ప్రధాని మోదీ. హొయసల దేవాలయాలపై అద్భుతమైన పవిత్ర శిల్పాలు చెక్కబడ్డాయి.. భారత దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, మన పూర్వీకుల అసాధారణ నైపుణ్యానికి హొయసల దేవాలయాలు నిదర్శనమన్నారు ప్రధాని. 

హొయసల దేవాలయాలు నిర్మాణం, చరిత్ర

కర్ణాటకలోని హొయసల దేవాలయాలు 10వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని పాలించిన హొయసల రాజవంశం నిర్మాణ ,కళాత్మక నైపుణ్యానికి అద్భుతమైన నిదర్శనం. ఈ ఆలయాలు అతిక్లిష్టమైన అద్భుత అలంకార శైలికి ప్రసిద్ధి. ఇవి కర్ణాటక రాష్ట్రంలోని బేలూర్, హళేబీడు, సోమనాధపుర ప్రాంతాల్లో ఉన్నాయి. 

చారిత్రక నేపథ్యం

10వ శతాబ్దంలో నృపా కామ రాజు స్థాపించిన హోయసల రాజవంశం.. దక్షిణ భారతదేశం సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని అనుభవిస్తున్న సమయంలో ఇవి నిర్మించబడ్డాయి. వారి పాలన గణనీయమైన సాంస్కృతిక, కళాత్మక అభివృద్ధి కాలాన్ని గుర్తింపుగా ఆలయ నిర్మాణం, కళల పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టారు హొయసల రాజవంశీకులు. హొయసల దేవాలయాలు..  ఆ రాజవంశ విజయాలు ముఖ్యంగా వారి దేవాలయాలు, వివిధ దక్షిణ భారత నిర్మాణ సంప్రదాయాలు, వారి విలక్షణమైన శైలిని ప్రతిబింబిస్తాయి.