Razakar Controversial: రజాకార్ విడుదల ఆపాలంటూ..తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించిన హెచ్‌ఆర్‌సీ

Razakar Controversial: రజాకార్ విడుదల ఆపాలంటూ..తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించిన హెచ్‌ఆర్‌సీ

బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, అనసూయ మకరంద్‌ దేశ్‌ పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘రజాకర్‌’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..రజాకార్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ హెచ్‌ఆర్‌సీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతకూడా హిందూ జనాభాపై రజాకార్లు చేసిన అకృత్యాలను, అన్యాయాలను చరిత్రలో తెలంగాణా బిడ్డల బాధలు, వారి త్యాగాలు..ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల చరిత్ర చెప్పడానికే ఈ సినిమా తీస్తున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు.

దీంతో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (APCR) వివాదాస్పద చిత్రమైన 'రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.APCR దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) మార్చి 11న విచారణకు రానుంది. APCR తెలంగాణ చాప్టర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అడ్వకేట్‌ అఫ్సర్‌ జహాన్‌ హైకోర్టులో సంస్థ ప్రయోజనాలను దృష్ట్యా వాదించబోతున్నారు.

APCR కార్యదర్శి నదీమ్ ఖాన్ మాట్లాడుతూ..పౌర హక్కులను పరిరక్షించడం మరియు మత సామరస్యాన్ని ప్రోత్సహించడంలో మేము ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అప్పట్లో మాజీ మంత్రి KTR కూడా రజాకార్ సినిమా విషయంలో స్పందించిన విషయం తెలిసిందే.'రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డు మరియు తెలంగాణ పోలీసులతో ఈ విషయాన్ని తీసుకెళ్తామని రామారావు హామీ ఇచ్చారు.ఇక ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పు పైనే ఈ సినిమా మార్చి 15 న రిలీజ్ ఉందా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది.