
బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకి కేరాఫ్‌గా నిలిచే హీరో హృతిక్ రోషన్. అలాంటి సినిమాలు తీయడంలో ఎక్స్‌పర్ట్ సిద్ధార్థ్ ఆనంద్. ఆల్రెడీ వీళ్లిద్దరి కాంబినేషన్‌లో బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా తెరకెక్కుతోంది. అదే.. ‘ఫైటర్’. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్ 18, మార్‌ఫ్లిక్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే యేడు జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇప్పుడు మరో కొత్త డేట్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 28న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు నిన్న అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డేకి తన సినిమా ‘పఠాన్’ను విడుదల చేస్తానని రీసెంట్‌గా షారుఖ్ ఖాన్ చెప్పాడు. అందుకే హృతిక్ మూవీ మరో తేదీకి షిఫ్ట్ అయ్యిందని టాక్.