ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో ప్రణయ్ జోరు

ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో ప్రణయ్ జోరు

కౌలాలంపూర్: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్ లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగ్గా.. హెచ్ఎస్ ప్రణయ సెమీఫైనల్ కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19వ ర్యాంకర్ ప్రణయ్ 25-23, 22-20తో 14వ ర్యాంకర్ కంటా నునెయామ (జపాన్) పై ఉత్కంఠ విజయం సాధించాడు. 60 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ రెండు గేమ్స్ లోనూ ఆఖర్లో అద్భుతంగా ఆడిన ప్రణయ్ ముందంజ వేశాడు. కానీ, విమెన్స్ సింగిల్స్ లో సింధు మరోసారి చైనీస్ తైపీ టాప్ షట్లర్ తై జుయింగ్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్ రెండో సీడ్ జు 21-13, 12-21, 21-18తో ఏదో సీడ్ సింధుపై నెగ్గింది. తొలిగేమ్ను కోల్పోయిన సింధు.. వెంటనే పుంజుకొని రెండో గేమ్లో నెగ్గినా.. అదే జోరు కొనసాగించలేకపోయింది. మూడో గేమ్లో వరుసగా తప్పిదాలు చేసిన ఆమె.. తై జు దూకుడును అడ్డుకోలేకపోయింది. ఫలితంగా తైజు చేతిలో 17వ ఓటమి ఖాతాలో వేసుకుంది.