కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందింది. స్వామివారి భక్తుడు మంతెన రామలింగ రాజు తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట తిరుమలలోని పీఏసి 1,2&3 భవనాల అధునీకరణకు ఏకంగా రూ. 9 కోట్లు విరాళం ఇచ్చారు.
కలియుగ దేవుడు.. సాక్షాత్తు వేంకటేశ్వరుని భక్తుడు మంతెన రామలింగ రాజు 2012 లో కూడా స్వామివారికి రూ.16 కోట్లు విరాళమిచ్చారు. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో... భారీ విరాళం అందజేసిన దాతకు టీటీడీ తరపున చైర్మన్ బీఆర్ నాయుడు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో టీటీడీకు మరిన్ని గొప్ప విరాళాలు దాత అందిస్తారని ఆశీస్తున్నానన్నారు.
