యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి  స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 4గంటలు..ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పడుతోంది.  మరో వైపు ఆలయంలో నిత్య పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి.   

ఇక నిన్న ఆలయానికి రూ.32,44,290 ఇన్‌‌‌‌‌‌‌‌కం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.14,05,900, కొండపైకి వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ప్రవేశంతో రూ.4.50 లక్షలు, వ్రత పూజల ద్వారా రూ.2,12,800, వీఐపీ దర్శనాలతో రూ.2.55 లక్షలు, బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శన టికెట్లతో రూ.1,96,200 ఇన్‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.