యాదగిరిగుట్టకు భక్తులు పొటెత్తారు. నూతన సంవత్సరం కావడం, అదివారం సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఉచిత దర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అటంకాలు ఎదురుకాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఏకంగా లక్ష లడ్డూలను రెడీ చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రసాదాల కౌంటర్లు ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి పెట్టారు.
2న ఉత్తర ద్వార దర్శనం
జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఆలయానికి ఉత్తర ద్వారం లేకపోవడంతో.. తూర్పు ద్వారం నుంచే స్వామివారు భక్తులకు దర్శనమిచ్చేవారు. పునర్నిర్మాణం తర్వాత ఆలయానికి నలువైపులా నాలుగు ద్వారాలు ఏర్పాటు చేయడంతో.. జనవరి 2న తొలిసారిగా ఉత్తర ద్వారదర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా జనవరి 2 నుంచి అధ్యయనోత్సవాలు షురూ కానున్నాయి. జనవరి 2 నుంచి 7 వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు కొనసాగనున్నాయి. అధ్యయనోత్సవాల సందర్భంగా ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.