తిరుమలలో పెరిగిన భక్తల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శానానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏప్రిల్ 07న శ్రీనివాసుడిని 60,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 30991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్టుగా టీటీడీ వెల్లడించింది.

తిరుమల ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడవాహన సేవను వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.  భక్తులు భారీ  సంఖ్యలో హాజరయ్యారు.