
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యతో తరలివచ్చారు భక్తులు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయంలోని మహామండపంలో స్వామివారికి కల్యాణం నిర్వహించి ఒడిబియ్యం, పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి శ్రీఘ్ర దర్శనానికి 2 గంటలు సమయం, ధర్మదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
యాదాద్రిలోనూ భక్తుల రద్దీ నెలకొంది. లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరారు. దీంతో రూ.150 సర్వదర్శనానికి రెండు గంటలు.. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ టి వినోద్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు.
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..
— Raju Pandari (@IamPandariRaju) December 31, 2023
డిసెంబర్ 31వ తేదీ ఆదివారం సెలవు దినంతోపాటు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు..#Yadadri #yadagirigutta #YadadriTemple pic.twitter.com/RHTfAiqFpR