
హైదరాబాద్, వెలుగు : ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.6.50 కోట్లు సీఎం సహాయనిధికి అందాయి. జీఎంఆర్ గ్రూప్ రూ.2 కోట్ల 50 లక్షలు విరాళంగా అందించింది.
కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు. రూ.కోటి విరాళంగా అందించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రతినిధులు, విక్రో ఫార్మా రూ.కోటి చొప్పున, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి రూ.కోటి విరాళంగా అందించారు.