IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు RCBకి బిగ్ షాక్.. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ వెళ్తున్న సాల్ట్

IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు RCBకి బిగ్ షాక్.. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ వెళ్తున్న సాల్ట్

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లే ఆప్స్ కు ముందు బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పిల్ సాల్ట్ ప్లేయర్ ఆప్స్ మ్యాచ్ లకు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. నివేదికల ప్రకారం  ఫిల్ సాల్ట్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన భార్య అబి మెక్‌లావెన్‌ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నందున సాల్ట్ త్వరలో ఇంగ్లాండ్ బయలుదేరుతున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆర్సీబీ జట్టు నుంచి సాల్ట్ దూరమైతే ఆ జట్టుకు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతేల్.. వెస్టిండీస్ తో సిరీస్ కారణంగా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. 

సాల్ట్ శుక్రవారం (మే 23) సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించాడు. పవరే ప్లే లో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడిన ఈ ఇంగ్లీష్ ఓపెనర్ ఆ తర్వాత చెలరేగి ఆడాడు. 32 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సాల్ట్ పోరాడినా ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయింది. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న సాల్ట్.. ఇప్పటివరకు  తొమ్మిది మ్యాచ్ ల్లో 168.31 స్ట్రైక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ దూరమైతే అతని స్థానంలో న్యూజీలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సైఫర్ట్.. కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు.

ALSO READ | ENG vs IND: ఫామ్ లేదు.. ఫిట్ నెస్ లేదు: షమీ కొంపముంచిన ఐపీఎల్.. టెస్ట్ రిటైర్మెంట్ ఖాయమా..?

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (48 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 94 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 42 రన్స్‌‌‌‌ తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. టాస్‌‌‌‌ ఓడిన హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 231/6 స్కోరు చేసింది. అభిషేక్‌‌‌‌ శర్మ (34), క్లాసెన్‌‌‌‌ (24), అనికేత్‌‌‌‌ వర్మ (26) ఫర్వాలేదనిపించారు. తర్వాత బెంగళూరు 19.5 ఓవర్లలో 189 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (62) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. కోహ్లీ (43) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. కమిన్స్‌‌‌‌ 3, మలింగ 2 వికెట్లు తీశారు. ఇషాన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఈ భారీ ఓటమితో బెంగళూరు రెండు నుంచి మూడో ప్లేస్‌కు పడిపోయింది.