ఎడ్యుకేషన్ స్టార్టప్‌‌‌‌లకు దండిగా ఫండ్స్​

ఎడ్యుకేషన్ స్టార్టప్‌‌‌‌లకు దండిగా ఫండ్స్​

2020లో రూ.16 వేల కోట్లు

పెరుగుతోన్న కంపెనీల వాల్యుయేషన్

క్లియర్ విన్నర్‌‌‌‌‌‌‌‌గా ఎడ్‌‌‌‌టెక్ సెక్టార్

రెండింతలు పెరగనున్న ఎడ్యుకేషన్ మార్కెట్

యూనికార్న్‌‌‌‌లుగా ఎడ్‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌లు

న్యూఢిల్లీ: ఇండియన్ ఎడ్‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌లకు ఈ ఏడాది మస్తు గా డబ్బులొచ్చాయి. కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో ఎక్కడికక్కడ స్కూల్స్ మూతపడటంతో ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్ తప్పనిసరైంది. దీంతో విద్యార్థులకు సాయం చేసేందుకు ఎడ్‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌లు పుట్టుకొచ్చాయి. ఎడ్‌‌‌‌టెక్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లకు విద్యార్థులు, టీచర్ల నుంచి వస్తోన్న డిమాండ్‌‌‌‌తో ఇన్వెస్టర్లు సైతం ఈ స్టార్టప్‌‌‌‌లలో పెట్టుబడుల వర్షం కురిపించారు. 2020లో ఇండియన్ ఎడ్‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌లు 2.2 బిలియన్ డాలర్లు అంటే రూ.16,332 కోట్ల మేర ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను సంపాదించుకున్నట్టు వెల్లడైంది. 2019లో వీటి ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు కేవలం 553 మిలియన్ డాలర్లు(రూ.4,068 కోట్లు)గానే ఉన్నాయి. కరోనా తర్వాత ఈ సెగ్మెంట్‌‌‌‌పై ఇన్వెస్టర్లకు కాన్ఫిడెన్స్ పెరిగిందని, దీంతో పెట్టుబడుల ప్రవాహం కొనసాగిందని ఐవీసీఏ–పీజీఏ ల్యాబ్స్ గురువారం పేర్కొంది. ‘ది గ్రేట్ అన్‌‌‌‌–లాక్‌‌‌‌డౌన్: ఇండియన్ ఎడ్‌‌‌‌టెక్’ పేరుతో రిపోర్ట్ తయారు చేసింది. గత ఐదేళ్లలో(2016–20) ఇండియన్ ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్ కంపెనీలు కేవలం 4 బిలియన్ డాలర్లను సేకరించాయి. వీటిలో ఎక్కువ క్యాపిటల్ బైజూస్, అన్‌‌‌‌అకాడమీ, వేదాంతాలకు వచ్చింది. గత ఐదేళ్లలో పొందిన సగం క్యాపిటల్‌‌‌‌ను ఒక్క ఏడాదిలోనే ఎడ్‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌లు పొందాయి. 2020లో 92 కంపెనీలు ఫండింగ్ పొందాయని, వాటిలో 66 కంపెనీలు సీడ్ ఫండింగ్ పొందినట్టు ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్(ఐవీసీఏ), పీజీఏ ల్యాబ్స్ తెలిపింది. ‘ఇండియన్ ఎడ్‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌లు 2020లో 2.22 బిలియన్ డాలర్లను పొందాయి. కే–12, టెస్ట్ ప్రీపరేషన్ కంపెనీలకు ఎక్కువగా 1.98 బిలియన్ డాలర్ల వరకు ఫండింగ్ వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూడ్ లెర్నింగ్ 142 మిలియన్ డాలర్లను, హయ్యర్ ఎడ్యుకేషన్ 84 మిలియన్ డాలర్లను, ప్రీ–కే 12 మిలియన్ డాలర్లను, బీ2బీ ఎడ్‌‌‌‌టెక్ కంపెనీలు 7 మిలియన్ డాలర్లను పొందాయి’ అని ఐవీసీఏ–పీజీఏ ల్యాబ్స్ తెలిపింది.

రూ.8.60 లక్షల కోట్లుగా ఎడ్యుకేషన్ మార్కెట్..

గత ఐదేళ్ల లెక్కలను తీసుకుంటే బైజూస్ ఎక్కువ క్యాపిటల్‌‌‌‌ను పొందింది. ఈ కంపెనీ ఐదేళ్లలో 2.32 బిలియన్ డాలర్లను పొందినట్టు రిపోర్ట్ తెలిపింది. తాజాగా ఈ కంపెనీ వాల్యుయేషన్ 12 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత అన్‌‌‌‌అకాడమీ 354 మిలియన్ డాలర్లు సేకరించి వాల్యూయేషన్ 2 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. ఇండియాలో ఎడ్యుకేషన్ మార్కెట్  2020లో 117 బిలియన్ డాలర్లుగా అంటే రూ.8,60,661 కోట్లుగా ఉంటుందని, ఆన్‌‌‌‌లైన్ లెర్నర్స్ 36 కోట్ల మంది ఉంటారని తాజా రిపోర్ట్ అంచనావేసింది. వీరిలో స్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌పై 49 బిలియన్ డాలర్లను, సప్లిమెంటరీ ఎడ్యుకేషన్(ప్రైవేట్ కోచింగ్, టెస్ట్ ప్రిపరేషన్)పై 42 బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నారని పేర్కొంది. ఆన్‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్ 2025 నాటికి రెండింతలు పెరిగి 225 బిలియన్ డాలర్లకు రూ.16,55,118 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంటోంది. 2020–25 ఆర్థిక సంవత్సరాల్లో వార్షీకంగా 14 శాతం చొప్పున ఈ మార్కెట్ పెరుగుతుందని రిపోర్ట్ తెలిపింది.

పెరుగుతోన్న బడ్జెట్ కేటాయింపులు..

ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు ఎడ్యుకేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు పెరుగుతున్నాయి. 2018–19లో 11.3 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయింపులను పొందితే.. 2020–21లో 13.2 బిలియన్ డాలర్లను పొందింది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో ఎడ్‌‌‌‌టెక్ ప్రొడక్ట్‌‌‌‌లకు డిమాండ్ పెరిగింది. పెరుగుతోన్న డిమాండ్ మేరకు ఎడ్‌‌‌‌టెక్ ప్లేయర్స్ కొత్త బిజినెస్ మోడల్స్‌‌‌‌ను ఆఫర్ చేస్తున్నాయి.

విజేత ఎడ్‌‌‌‌టెక్ సెక్టారే..

ఇండియాలో ఎడ్‌‌‌‌టెక్ సెక్టార్ క్లియర్ విన్నర్ అని, ఛాంపియన్ ఇదేనని ఐవీసీఏ ప్రెసిడెంట్ రజత్ టాండన్ పేర్కొన్నారు. లెర్నర్స్ అవసరాల్లో మార్పులు రావడంతో.. ఎడ్యుకేషన్, ఎడ్‌‌‌‌టెక్‌‌‌‌ సెక్టార్ రూపురేఖలు కూడా మారిపోయాయని ప్రాక్సిస్ గ్లోబల్ అలయెన్స్ ప్రాక్టీస్ లీడర్ మధుర్ సింఘాల్ చెప్పారు. స్కూల్స్, కాలేజీల్లో చెప్పేదాని కంటే ఎక్కువగా ప్రొఫెషనల్ కోర్సుల గురించి విద్యార్థులు తెలుసుకోవాలనుకోవడం, స్వయంగా ప్రిపేర్ కావాలనుకోవడం వంటివి ఎడ్‌‌‌‌టెక్ సెక్టార్ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఇనొవేషన్స్‌‌‌‌కు ప్రోత్సాహం ఇస్తున్నాయి. వచ్చే పదేళ్లలో ఇండియాలో ఎడ్‌‌‌‌టెక్ యూనికార్న్‌‌‌‌లు కూడా వస్తాయని పీజీఏ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ వైభమ్ థామ్రాకర్ అన్నారు. ఎడ్యుకేషన్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ డిజిటైజ్ కావడం, లెర్నింగ్ ఎకోసిస్టమ్‌‌‌‌లో మార్పులు, ఎంప్లాయీబిలిటీ, ప్రొఫెషనల్ కెరీర్ గ్రోత్, స్టూడెంట్ లైఫ్ సైకిల్ సర్వీసులు వంటివి ఎడ్‌‌‌‌టెక్‌‌‌‌లు యూనికార్న్‌‌‌‌లుగా మారేందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.

For More News..

యోగాకు అధికారిక గుర్తింపు

మెంటల్‌ టార్చర్‌ చేస్తున్నరు.. ఇక ఆడను

కొత్త ఏడాదిలో మస్త్ జాబ్స్