బంగారంపై భారీ లాభాలు

బంగారంపై భారీ లాభాలు

25 ఏళ్లలో 748 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో దీపావళి. దానికి రెండు రోజుల ముందు ధన్‌‌‌‌‌‌‌‌తేరస్‌‌‌‌‌‌‌‌ జరుపుకుంటారు. ఈ పర్వదినం కోసం చాలా మంది హిందువులు బంగారం కొంటుంటారు. పండగల సమయంలోనే కాదు  ఇండియాలో ఏడాది పొడవునా బంగారానికి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. అందుకే దీని ధరలు ఏటా దూసుకెళ్తున్నాయి. 1994లో పది గ్రాముల బంగారం ధర రూ.4,598 కాగా, ఇప్పుడు ఇది రూ.39 వేలకు చేరింది. అంటే ఈ 25 ఏళ్లలో ఏకంగా 748 శాతం పెరిగినట్టు! ఉదాహరణకు ఒక వ్యక్తి 1994లో రూ.2.5 లక్షలతో 543 గ్రాముల బంగారం కొంటే దాని విలువ ఇప్పుడు రూ.21 లక్షలు అవుతుంది. ఈ ఏడాది సెప్టెంబరులో పది గ్రాముల బంగారం ధర రూ.40 వేల మార్కును దాటింది. ఈ బుధవారం ధరలు రూ.39 వేలకు చేరాయని, పండగల సమయం కావడం, రూపాయి బలహీనపడటమే ఇందుకు కారణమని హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్టు ఒకరు చెప్పారు.

బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

బంగారం ధరలు ఏటా విపరీతంగా పెరగడాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా పరిగణించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి ద్రవ్యోల్బణాన్ని కూడా తట్టుకునే శక్తి ఉంది. అవసరమైనప్పుడు బంగారాన్ని కుదవబెట్టి లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకునే అవకాశం ఎలాగూ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లు ఇచ్చే రాబడులు తగ్గాక, చాలా మంది పసిడివైపు మొగ్గారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, ట్రేడ్‌‌‌‌‌‌‌‌వార్‌‌‌‌‌‌‌‌, రూపాయి బలహీనత వల్ల సమీప భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఈక్విటీ మార్కెట్లో రాబడులు తక్కువగానే ఉంటాయని ఎనలిస్టులు చెబుతున్నారు.

నేరుగా కొనడం..

జ్యూయలరీ షాపుల నుంచి మనకు నచ్చినంత బంగారం కొనుక్కోవచ్చనే విషయం తెలిసిందే. అయితే భద్రత, ఎక్కువ ధరలు, ఔట్‌‌‌‌‌‌‌‌ డేటెడ్‌‌‌‌‌‌‌‌ వంటి సమస్యలు ఉంటాయి. మేకింగ్‌‌‌‌‌‌‌‌ చార్జీలు మరో ఇబ్బంది. ఇవి బంగారం ధరపై 6–14 శాతం వసూలు చేస్తారు. అదే బంగారాన్ని తిరిగి అమ్మితే ఈ చార్జీల మొత్తాన్ని వదులుకోవాల్సిందే!

డిజిటల్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌

బంగారు నాణేలు, బార్లు, నగలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనూ కొనొచ్చు. పేటీఎం మొబైల్‌‌‌‌‌‌‌‌ వాలెట్‌‌‌‌‌‌‌‌ ఇలాంటి సేవలను అందిస్తోంది. మోతీలాల్‌‌‌‌‌‌‌‌ ఓస్వాల్‌‌‌‌‌‌‌‌ కంపెనీ డిజిటల్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పథకం ‘మీ–గోల్డ్‌‌‌‌‌‌‌‌ ’లోనూ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు.

సావరిన్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ బాండ్స్ (ఎస్‌‌‌‌‌‌‌‌జీబీ)

కాగితరూపంలో ఉండే బంగారం కావాలని సావరిన్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ బాండ్లను కొనుక్కోవచ్చు. వీటిని ప్రభుత్వమే అమ్ముతుంది. బాండ్ల అమ్మకం కోసం ప్రభుత్వం ప్రత్యేక విండోను కూడా నిర్వహిస్తోంది. ఈ విండో వారంపాటు పనిచేస్తుంది. మార్కెట్‌‌‌‌‌‌‌‌ వాల్యూ ప్రకారమే రేట్లు ఉంటాయి.

గోల్డ్‌‌‌‌‌‌‌‌ కాయిన్లు

జ్యూయలర్లు, బ్యాంకులు, ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలతోపాటు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌ కంపెనీలూ గోల్డ్‌‌‌‌‌‌‌‌ కాయిన్లను అమ్ముతాయి. ఇది గ్రాము మొదలుకొని 100 గ్రాముల వరకు అమ్ముతారు. వీటికి మేకింగ్‌‌‌‌‌‌‌‌ చార్జీలు ఏమీ ఉండవు.

గోల్డ్‌‌‌‌‌‌‌‌ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌

బంగారంపై ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేయడానికి గోల్డ్‌‌‌‌‌‌‌‌ సేవింగ్స్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌లూ అందుబాటులో ఉన్నాయి. నెలకు కొంతమొత్తం వాయిదాగా నిర్ణీత కాలానికి చెల్లించి బంగారం కొనుక్కోవచ్చు. గడువు ముగియగానే బంగారం చేతికి వస్తుంది. కొంత బోనస్‌‌‌‌‌‌‌‌ను కూడా పొందవచ్చు. మెచ్యూరిటీ అయ్యాక ఉన్న రేటు ప్రకారం బంగారం ఇస్తారు.

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుంది. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈక్విటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌ రాబడులు ఆశించిన మేర లేవు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడిని సురక్షితంగా భావిస్తున్నారు. పసిడిపై ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. గత 25 ఏళ్లుగా దీని ధరలు కొన్ని వందలరెట్లు పెరిగాయి. మరికొన్ని రోజుల్లో దీపావళి, దన్‌‌‌‌‌‌‌‌తేరస్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి కాబట్టి గోల్డ్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగారంపై ఎలా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలో తెలుసుకుందాం.

భారీ డిస్కౌంట్లు

ఫెస్టివల్ సీజన్‌‌‌‌‌‌‌‌లో కస్టమర్లను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, కస్టమర్లను కోల్పోకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇండియాలో మోస్ట్ వాల్యుబుల్ జ్యుయల్లర్ తనిష్క్ నుంచి కల్యాణ్ జ్యుయల్లర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి రిటైల్‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌లన్నీ డిస్కౌంట్ల బాట పట్టాయి. అమ్మకాలను పెంచుకోవడానికి తనిష్క్ హై ఎండ్ జ్యూయలరీపై భారీ డిస్కౌంట్లు ఇస్తుండగా.. కల్యాణ్ జ్యుయల్లర్స్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లతో జతకట్టింది. కొన్నికార్డులతో కొంటే డిస్కౌంట్లు ఇస్తోంది. కొన్ని సంస్థలు మేకింగ్‌‌‌‌‌‌‌‌ చార్జీలను భారీగా తగ్గించాయి.  కల్యాణ్ జ్యుయల్లర్స్ డ్రా ద్వారా కొందరు కస్టమర్లను ఎంపిక చేసి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది.