హైదరాబాద్ సిటీలోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుపడింది. వాహన తనిఖీలలో రూ.1 కోటి 21 లక్షలు నగదును పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం (అక్టోబర్ 1) సాయంత్రం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో వాహనాల తనిఖీలు చేస్తుండగా.. టీసీఎస్ జుపిటర్ బైక్ వెళ్తున్న ఇద్దరిని అపేందుకు యత్నించగా తప్పించుకొని పోయారు.. వెంబడించిన పోలీసులు ఇద్దరిని కోఠి హనుమాన్ టెక్డీ వద్ద పట్టుకున్నారు.
రాజస్థాన్ కు చెందిన లక్ష్మణ్ (27), వసంత్ (24) లు తీసుకెళ్తున్న బ్యాగ్ ను చెక్ చేయగా..అందులో కోటి రూపాయల నగదు బయటపడింది. పట్టుబడ్డ లక్ష్మన్, వసంత్ లను విచారించగా.. తరుణ్ అనే మరో వ్యక్తి పేరు చెప్పారు.. దీంతో హనుమాన్ వ్యాయామ శాల వద్ద ఉన్న ఓ ఆపార్టమెంట్ ఉన్న తరుణ్ అదుపులోకి తీసుకున్నారు.. అతని వద్ద రూ. 21లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Also Read :- వరద సాయం విడుదల చేసిన కేంద్రం
ముంబైలోని బబ్లూ అనే హవాలావ్యాపారి ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నట్లు పట్టుబడ్డ నిందితులు చెప్పారు. నగరంలోని వ్యాపారులనుంచి ఈ లావాదేవీలు సాగిస్తున్నట్లు డీసీసీ బాలస్వామి చెప్పారు.
హవాలాడబ్బు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి కోటి 21లక్షల నగదును సీజ్ చేసి ఇన్ కమ్ టాక్స్ అధికారులకు అప్పగించినట్లు డిసీపీ చెప్పారు. ప్రధాన నిందితుడు బబ్లూ ను తర్వలో అరెస్ట్ చేస్తామని డీసీపీ చెప్పారు.