
నల్లగొండ: నల్లగొండ: నాగార్జనసాగర్ సాగర్ ఎడమ కాల్వకు గండి పడింది. త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి దగ్గర్లో లో డైరీ ఫాం తూం సమీపంలో కాల్వకట్టకు భారీ రంధ్రం పడింది. ఇటీవల పాలేరు రిజర్వాయ్లలోకి నీటిని విడుదల చేసిన క్రమంలో నీటి చెమ్మకుకట్ట కుంగిపోయి.. నీటి విడుదల నిలిపివేసిన తర్వాత ఈ గండి బయటపడింది. అప్రమత్తమైన ఎన్‌ఎస్‌పీ అధికారులు గండిని పూర్చేందుకు చర్యలు చేపట్టారు. కాల్వకు నీటి విడుదల చేయక ముందే గండి పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.