హైదరాబాద్: మలక్ పేట్‌లో ఓ హోటల్ యాజమాన్యం చేసిన నిర్వాకం పోలీసుల లాఠీ చార్జ్ కు దారితీసింది. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముసరాంబాగ్‌లోని హజీబో హోటల్ యాజమాన్యం.. ఫ్రీగా హాలిమ్ ఇస్తున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. దీంతో వందలాదిగా జనాలు అక్కడకి చేరుకున్నారు.
ఉచితంగా హలీమ్ ఇవ్వడం ప్రారంభం కాగానే, జనాలందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో హోటల్ యాజమాన్యం..జనాలను కంట్రోల్ చేయలేక పోలీసులకు సమాచారం అందించింది. అక్కడకి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసుల తీరుపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. తమ పబ్లిసిటీ కోసం ఈ పరిస్థితికి కారణమైన హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా.. తమపై లాఠీ చార్జ్ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఫ్రీ హలీమ్ అనగానే ఎగబడ్డ జనం.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2024
హైదరాబాద్ ముసారాంబాగ్ వద్ద ఓ వ్యాపారవేత్త చేసిన ఆలోచన వల్ల పలువురికి దెబ్బలు తగిలేలా చేశాయి.
ఫ్రీ హలీమ్ కోసం తోపులాట, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు తేలికపాటి లాఠీ ఛార్జ్ చేశారు. pic.twitter.com/gOIMpMeY09
