భారత్ బంద్ ఎఫెక్ట్...ఢిల్లీలో నిలిచిన వెహికిల్స్

భారత్ బంద్ ఎఫెక్ట్...ఢిల్లీలో నిలిచిన వెహికిల్స్

ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పూర్తిగా వాహనాలతో జామ్ అయిపోయింది. ఢిల్లీ-యూపీ, ఢిల్లీ హర్యానా హైవేపు పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి. అగ్నిపథ్కు వ్యతిరేకంగా భారత్ బంద్కు ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఢిల్లీలో బంద్ ప్రభావం పెద్దగా లేకపోయినా...పోలీసులు వాహనాలను తనిఖీలు చేసేందుకు ఆపడంతో..రోడ్లపై వెహికిల్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ఓవైపు భారత్ బంద్..మరోవైపు కాంగ్రెస్ ఆందోళన నేపథ్యంలో..నేషనల్ కాపిటల్ రీజియన్ పరిధిలో పోలీసులు చెకింగ్ చేపట్టారు. 

అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ దేశరాజధానిలో నిరుద్యోగులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్, పీఎం ఆఫీసు, రాష్ట్రపతి భవన్ల ముందు ఆందోళనలు జరిగే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో..అలర్ట్ అయ్యారు. భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. హైవేలపై పోలీసులు తనిఖీలు చేపట్టడంతో..ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. 

భారత్ బంద్ నేపథ్యంలో  రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. వెస్ట్రన్ రైల్వే జోన్ పరిధిలో 80 ట్రైన్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ బంద్ నేపథ్యంలో  ఢిల్లీలోని రైల్వే స్టేషన్లలో భారీగా పోలీసులను మోహరించారు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్తో పాటు కానిస్టేబుల్స్ ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు.